సాధారణంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత వారి బంధం 10 కాలాలపాటు మంచిగా ఉండాలి అంటే వారిద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని చెబుతుంటారు
అయితే కొన్నిసార్లు మన లైఫ్ పార్ట్నర్ కి కొన్ని విషయాలు తెలియకపోతేనే వారి జీవితం ఎంతో మంచిగా ఉంటుందని చెప్పాలి.
మరి ఏ విషయాలను తమ లైఫ్ పార్ట్నర్ దగ్గర సీక్రెట్ గా ఉంచాలి అనే విషయాన్ని వస్తే…పెళ్లికి ముందు కొందరు పలుసార్లు సెక్స్ లో పాల్గొంటారు
అయితే ఇలా పెళ్లికి ముందే మేము సెక్స్ లో పాల్గొన్నామనే విషయాన్ని లైఫ్ పార్ట్నర్ కు చెప్పాల్సిన పని లేదు. ఈ విషయం చెప్పడం వల్ల మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది
కనుక చెప్పకపోవడమే మంచిది.ఇక చాలామందికి ఎన్నో అలవాట్లు ఉంటాయి అయితే ఆ అలవాట్లకు సంబంధించిన విషయాలను
అందరి ముందు చెప్పడం కొందరికి నచ్చదు అందుకే మీ అలవాట్లను అందరి ముందు చెప్పకపోవడం మంచిది.
ఇక ప్రతి ఒక్కరికి అందరూ నచ్చాలని రూల్ ఏమీ లేదు మీ జీవిత భాగస్వామి మీకు చాలా బాగా నచ్చి ఉండవచ్చు కానీ వారి కుటుంబ సభ్యులు మీకు నచ్చకపోవచ్చు
కానీ మీ కుటుంబ సభ్యులు నచ్చలేదని మీ లైఫ్ పార్ట్నర్ తో ఈ విషయాన్ని ఎప్పటికీ చెప్పకూడదు.
పెళ్లికి ముందే మీకు ఇతరులతో రిలేషన్ లో ఉంటూ బ్రేకప్ అయిన విషయాలను జీవిత భాగస్వామితో చెప్పకూడదు.
అలాగే సెక్స్ లో పాల్గొన్నప్పుడు కలిగే అనుభూతితో ఇదివరకే పొందానని చెప్పాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.