కళ్యాణ్ రామ్ “అమిగోస్” అఫీషియల్ డేట్ వచ్చింది.!

 ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర పలు ఆసక్తికర సినిమాలే వచ్చాయి. మరి వీటిలో పలు హిట్స్ ఉన్నాయి అలాగే పలు ఫట్టయ్యిన సినిమాలు కూడా ఉన్నాయి.

 కాగా ఈ సినిమాల్లో అయితే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన సినిమా “అమిగోస్” కూడా ఒకటి.

 అయితే ఈ చిత్రం బింబిసార రేంజ్ హిట్ అవుతుంది అనుకున్నారు కానీ తీరా టోటల్ గా చూస్తే ప్లాప్ గానే మిగిలిపోయింది.

 కానీ సినిమాలో కాన్సెప్ట్ కొంతమందికి నచ్చింది. దీనితో పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ అయితే చాలా మంది ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా చూసారు.

 అయితే ఇప్పుడు ఈ అవైటెడ్ సినిమా ఓటిటి విడుదల ఎప్పుడు అనేది ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

 అయితే వారు ఈ సినిమాని మొదట ఈ మార్చ్ 10న స్ట్రీమింగ్ కి తీసుకొస్తారని అప్డేట్ వచ్చింది.

 కానీ ఇప్పుడు అయితే అఫీషియల్ క్లారిటీ యాప్ నుంచి తెలుస్తుంది. ఈ సినిమాని వారు వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలిపారు.

 దీనితో అయితే అప్పుడు మిస్ అయ్యివారు ఆల్ మోస్ట్ ఇంకో నెల ఆగాల్సిందే అని చెప్పాలి.

 కాగా ఈ సినిమాకి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించగా ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.

 అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి నిర్మాణం అందించారు జిబ్రాన్ సంగీతం సమకూర్చాడు.