మిస్ యు సో మచ్ అంటూ కూతురు వీడియో చూసి ఎమోషనల్ అయిన కళ్యాణ్ దేవ్… పోస్ట్ వైరల్!

 కళ్యాణ్ దేవ్ చిరంజీవి చిన్నల్లుడుగా శ్రీజను వివాహం చేసుకొని ఈయన కూడా విజేత సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

 అయితే ఈయనకు శ్రీజకు మధ్య మనస్పర్ధలు రావడం చేత గత కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

 అయితే వీరిద్దరీ మనస్పర్ధల కారణంగా వీరికి విడాకులు కూడా పూర్తయ్యాయని ఈ విషయాన్ని మాత్రం మెగా ఫ్యామిలీ చాలా గోపంగా ఉంచిందని తెలుస్తోంది.

 ఇలా శ్రీజ కళ్యాణ్ దూరంగా ఉండడంతో వీరి కుమార్తె నవిష్క కూడా శ్రీజ వద్ద ఉండడంతో.కళ్యాణ్ తన కుమార్తెను చాలా మిస్ అవుతున్నట్లు పలుమార్లు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు.

 ఇలా తరచూ తన కుమార్తె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన కూతురి గురించి ఎమోషనల్ పోస్టులు చేస్తూ ఉంటారు.

 అయితే డిసెంబర్ 25వ తేదీ తన కుమార్తె నవిష్క పుట్టిన రోజు కావడంతో నువ్వే నా ప్రపంచం నువ్వు నా కూతురివి…

 నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది మిస్ యు సో మచ్ లవ్ యు అంటూ తన కూతురిని చాలా మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

 ఈ విధంగా తన కుమార్తె గురించి ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తు తన ఆవేదన బయటపెడుతున్న కళ్యాణ్ దేవ్ తాజాగా మరొకసారి తన కూతురిని చాలా మిస్ అవుతున్నట్లు తెలియజేశారు.

 తాజాగా నవిష్కకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 ఈ వీడియో చూసిన అనంతరం కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మిస్ యు సో మచ్ అంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.