మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా లేటెస్ట్ గా నటించిన భారీ ఏక్షన్ చిత్రం వీరసింహా రెడ్డి తో మరో క్లీన్ హిట్ ని అయితే తన ఖాతాలో వేసుకున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత అయితే వెంటనే బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఇంకో ఇంట్రెస్టింగ్ సినిమాని తాను చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేయగా బాలయ్య కూడా కొంతమేర షూటింగ్ ని అయితే కంప్లీట్ చేశారు.
ఐతే ఇటీవల వారి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో బాలయ్య అందాకా అన్ని పనులకి బ్రేక్ ఇచ్చారు.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాతోనే సీనియర్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రీ రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
మరి ఈ టాక్ లో అయితే కాజల్ ఎప్పుడు అడుగు పెట్టనుందో సినీ వర్గాలు చెప్తున్నాయి.
ఈ సినీరంలో కాజల్ అయితే ఈ మార్చ్ మొదటి వారం నుంచి సెట్స్ లో అడుగు పెట్టనుందట.
ఆమెపై సీన్స్ ని దర్శకుడు అనీల్ రావిపూడి అప్పటికి షెడ్యూల్ చేసాడట. అలాగే ఆ తర్వాత బాలయ్య సినిమాలోకి రానున్నారట.
కాగా ఈ సినిమాలో బాలయ్య పలు భిన్నమైన షేడ్స్ లో నటించనుండగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల బాలయ్య కూతురుగా కనిపించనుంది.
అలాగే అఖండ వీర సింహా రెడ్డి సినిమాల తర్వాత థమన్ బాలయ్య సినిమాకి హ్యాట్రిక్ గా ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాడు.