చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ రిప్లై.. తారక్ లో మార్పు మొదలైందా?

 ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

 ఈ అవార్డ్ విషయంలో చిత్ర బృందానికి ప్రముఖ సెలబ్రిటీల నుంచి, ప్రధాన రాజకీయ నాయకుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

 అయితే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్.ఆర్.ఆర్ గురించి పాజిటివ్ గా ట్వీట్ చేయగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించి రియాక్ట్ అయ్యారు.

 థాంక్యూ సో మచ్ మామయ్యా అంటూ తారక్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ కు క్షణాల్లో వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి.

 తారక్ పై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అభిమానం ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తారక్ టీడీపీకి దగ్గరవుతున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 2024 ఎన్నికల్లో గెలుపు కోసం తారక్ ను వాడుకోవాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు.

 ఇప్పటికే పవన్ కళ్యాణ్ నుంచి ఒకవైపు సపోర్ట్ లభిస్తున్నా మరోవైపు ఎన్టీఆర్ సపోర్ట్ కూడా ఉండటం అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు.

 చంద్రబాబుకు అనుకూలంగా పరిస్థితులు సైతం మారుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ బాధ్యతలు ఇస్తే

 టీడీపీని కచ్చితంగా సక్సెస్ చేయడంలో తారక్ విజయం సాధిస్తారని పొలిటికల్ వర్గాల్లో మంచి అభిప్రాయం అయితే ఉంది.

 మరి తారక్ సపోర్ట్ చంద్రబాబుకు తాత్కాలికంగా ఉంటుందా? లేక శాశ్వతంగా ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 కెరీర్ పరంగా తారక్ ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాల్సి ఉంది. తారక్ పొలిటికల్ కెరీర్ పై దృష్టి పెడతారో లేదో స్పష్టత రావాల్సి ఉంది.