బాలయ్య చేసిన పనికి అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్..?

 టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 నందమూరి తారక రామారావు ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన టాలీవుడ్ సినీ చరిత్రలో స్టార్ హీరోగా చెరగని ముద్ర వేసుకున్నాడు.

 ఆ తర్వాత నందమూరి కుటుంబం నుండి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఇండస్ట్రీలో తారక రామారావు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన పేరు నిలబెడుతున్నారు.

 జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు నందమూరి కుటుంబం నుండి ఆయనకు ఎటువంటి సపోర్ట్ లేదన్న సంగతి అందరికీ తెలిసింది.

 అయితే గతంలో ఒక అవార్డు ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.

 ఆ సమయంలో బాలకృష్ణ గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 గతంలో ఒక అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ చేతులు మీదుగా అవార్డు అందుకున్నాడు. ఇలా బాబాయ్ చేతుల మీదుగా అవార్డు అందుకోవటంతో జూనియర్ ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ అయ్యాడు.

 ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ” అందరూ మా బాబాయి గురించి ఎన్నో విధాలుగా చెబుతూ ఉంటారు కానీ

 నేను ఆయన గురించి ఒకే మాట చెప్పగలను ‘ఆయన నడిచే విజ్ఞాన గని’ ఈ ఒక్క మాట ఆయనకు కరెక్ట్ గా సరిపోతుంది అంటూ బాలకృష్ణ గురించి గొప్పగా చెప్పాడు.

  అయితే ఎన్నో ఏళ్లుగా నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇలా మాట్లాడటంతో బాలకృష్ణ ఒక్కసారిగా ఎన్టీఆర్ భుజం మీద చేతులు వేసి ఆపేయంగా హత్తుకున్నాడు .

 ఇలా ఇద్దరు అభిమాన హీరోలు ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ వారి ఆనందాన్ని పంచుకున్నారు.

 అయితే బాలకృష్ణ ఇలా ఆప్యాయంగా హద్దుకోవటంతో జూనియర్ ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ అయి అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

 గతంలో ఒక అవార్డు కార్యక్రమంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.