150 నియోజకవర్గాలపై క్లారిటీతో వున్న జనసేన.!

జనసేన పార్టీ మొత్తంగా 175 సీట్లలో పోటీ చేస్తుందా.? లేదా.? అన్న ప్రశ్నకు ఆ పార్టీ నేతలైతే సమాధానం చెప్పలేని పరిస్థితి. ‘ఎన్నికల వ్యూహాలు, పొత్తుల వ్యవహారాలు నాకు వదిలెయ్యండి..

ప్రజలకు మనం ఏం మేలు చేయగలమో ఆలోచించండి.. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయండి..’ అంటూ జనసైనికులకు సూచిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

నిజానికి, ఇతర పార్టీల కార్యకర్తలతో పోల్చితే, జనసైనికులు చాలా చాలా భిన్నం. సొంత లాభం చూసుకోవడంలేదు. స్వార్జితం నుంచి ఖర్చు చేసి మరీ, ప్రజల తరఫున నినదిస్తున్నారు.

వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల వేళ.. ప్రజల్ని ఆర్థికంగా ఆదుకుంటున్నారు కూడా.

ఇక, జనసేన పార్టీ నుంచి 175 నియోజకవర్గాల్లోనూ టిక్కెట్లను ఆశిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

వారిలో ఎంతమంది ప్రస్తుత రాజకీయాల్ని తట్టుకుని చివరి వరకు బరిలో వుండగలుగుతారు.?

అన్నది వేరే చర్చ. జనసేన నాయకులైతే 150 స్థానాల్లో పార్టీ పోటీపై తమకు ఖచ్చితమైన అవగాహన వుందని చెబుతున్నారు. మరి, మిగిలిన 25 నియోజకవర్గాల మాటేమిటి.?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం’ అని జనసేనాని చెబుతున్నారు. అంటే, ఖచ్చితంగా పొత్తుల పంచాయితీ వుంటుందన్నమాట. పొత్తుల పంచాయితీ అంటే, 100 సీట్లలో జనసేన పోటీ చేయడం కూడా కష్టమే.

వైసీపీ ఆరోపిస్తున్నదే నిజమైతే, 30 సీట్ల కంటే జనసేన ఎక్కువ చోట్ల పోటీ చేయకపోవచ్చు. మరి, ఈ 150 సీట్లపై జనసేన అవగాహన ఏంటబ్బా.?