గత కొద్ది కాలంగా టాలీవుడ్లో నటించేందుకు బాలీవుడ్ తారలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పుటీకే రీసెంట్గా ఆలియా భట్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ అనుపమ ఖేర్ సహా పలువురు తారలు నటించగా.. ప్రస్తుతం బాబీ డియోల్ హరిహర వీరమల్లులో నటిస్తున్నారు.
అయితే తాజాగా మరో స్టార్ హీరో కూడా తెలుగులో నటించేందుకు సిద్ధమవుతున్నారని ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరెవరో కాదు మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.
ఈయన మహేశ్-రాజమౌళి కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలో నటించనున్నారని ప్రచారం సాగుతోంది.
మరి ఇందులో నిజమెంతో తెలియదుగానీ ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్‌మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
ఇకపోతే గతంలో ఆమిర్ కూడా.. రాజమౌళి దర్శకత్వంలో ఎలాంటి పాత్ర వచ్చిన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
తెలుగు స్టార్స్‌తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జక్కన్న..
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ కోసం అమీర్ ఖాన్‌ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక అమీర్ ఖాన్ కూడా ఒప్పుకున్నాడనే ప్రచారం నడుస్తుంది.
అలా ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ప్రచారం నడుస్తున్నప్పటికీ మరో వాదన కూడా వినిపిస్తోంది.
ఆమిర్ ఖాన్ ఈ చిత్రంలో నటిస్తాడనే నమ్మకం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది.
అసలే ఆయన భిన్నమైన కథలు, పాత్రలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.
ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లను అందుకుంటుంటాయి.
అలాంటప్పుడు ఆయన కమర్షియల్‌గా రూపొందే జక్కన్న సినిమాలో ఎందుకు నటిస్తాడనే వాదనలు వినిపిస్తున్నాయి.