టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు శర్వానంద్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం హీరోగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకునే రేంజ్ ని శర్వానంద్ వచ్చాడు.
ఇక అతని కెరియర్ పరంగా చూసుకుంటే ఎక్కువగా కంటెంట్ బేస్డ్ కథలు కనిపిస్తాయి. కమర్షియల్ కథలతో అతనికి వచ్చిన సక్సెస్ చాలా తక్కువ.
కమర్షియల్ కథలైన అనవసరమైన ఎలివేషన్స్ లేకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న
కథలతో శర్వానంద్ సినిమాలు చేస్తే వాటిని ఆడియన్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ గత ఏడాది ఒకే ఒక జీవితం అనే మూవీతో
ప్రేక్షకుల ముందుకి వచ్చిన శర్వానంద్ సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా ఐదు డిజాస్టర్ సినిమాల తర్వాత ఒకే ఒక జీవితంతో అతనికి హిట్ రావడం విశేషం.
ఇక ఈ మూవీ తర్వాత శర్వానంద్ కి కూడా తన నుంచిఆడియన్స్ఎలాంటికథలుకోరుకుంటున్నారు అనే విషయంలో ఫుల్ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది.
దీంతో కృష్ణ చైతన్య దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమాని గత ఏడాది స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ మూవీని,
దర్శకుడిని శర్వానంద్ పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. కంటెంట్ బాగున్నా కూడా ఆ స్టొరీ తనకి సెట్ కాదని శర్వానంద్ ఫిక్స్ కావడంతో వద్దనుకున్నట్లు తెలుస్తుంది.
అయితే ఆ సినిమా నిర్మాతలకి నష్టం లేకుండా ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అదే ప్రొడక్షన్ లో సినిమా చేయడానికి శర్వానంద్ సిద్ధమైనట్లు గా టాక్ వినిపిస్తుంది.
ఈ మూవీ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉందని సమాచారం. త్వరలో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళి వీలైనంత వేగంగా ప్రేక్షకులకి అందించాలని శర్వానంద్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
శర్వానంద్ రిజక్ట్ చేయడంతో కృష్ణ చైతన్య తన కథని వేరొక హీరోతో చేయడానికి డిసైడ్ అయినట్లుగా సమాచారం. ఈ నేపధ్యంలో అతను హీరో వేటలో ఉన్నట్లు తెలుస్తుంది.