కేసీఆర్ జాతకం బాలేదా.. ఏ పని చేసినా ఎదురుదెబ్బ తగులుతోందిగా?

 తెలంగాణ రాష్ట్రానికి రెండు పర్యాయాలు సీఎం అయిన కేసీఆర్ 2023 లేదా 2024లో జరిగే ఎన్నికల్లో కూడా పార్టీని అధికారంలోకి తెస్తే మాత్రం 15 సంవత్సరాల పాటు సీఎంగా పాలన సాగించిన ముఖ్యమంత్రిగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 ఓటుకు నోటు కేసు సహాయంలో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి అప్పట్లో కేసీఆర్ చెక్ పెట్టడం హాట్ టాపిక్ అయింది.

 అదే విధంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీకి షాక్ ఇవ్వాలని కేసీఆర్ భావించగా అందుకు భిన్నంగా జరుగుతోంది.

 నమోదైన కేసులకు భిన్నంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలకే కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 మునుగోడు ఉపఎన్నికలో పార్టీ గెలిచినా ఆ సంతోషం లేకపోయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

 బీజేపీ అగ్ర నేతల పరువు తీయాలని కేసీఆర్ భావిస్తే అందుకు భిన్నంగా జరుగుతోంది. లిక్కర్ స్కామ్ లో కవితకు ఇబ్బందులు తప్పవని ప్రచారం సాగుతోంది.

 ఈడీ, సీబీఐ జోక్యంతో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. జాతీయ స్థాయిలో సక్సెస్ కావాలని భావిస్తున్న కేసీఆర్ కు అందుకు భిన్నంగా జరుగుతుండటం గమనార్హం.

 టీ.ఆర్.ఎస్ పేరు అచ్చొచ్చిన స్థాయిలో కేసీఆర్ కు బీ.ఆర్.ఎస్ అచ్చు రాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

 ఒక తప్పటడుగు వల్ల బీ.ఆర్.ఎస్ పార్టీ ఎన్నో తప్పటడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొంతమంది చెబుతున్నారు. కేసీఆర్ పార్టీ బలహీనపడేలా బీజేపీ అడుగులు ఉన్నాయి.

 మునుగోడులో సక్సెస్ సాధించి ప్రజల మనస్సులను గెలుచుకుందామని భావించిన బీజేపీ అక్కడ ఓటమిని జీర్ణించుకోవడం లేదు.