మీపై మీ భార్య చాలా కోపంగా ఉందా… ఇలా చేసి మీ భార్య కోపాన్ని తగ్గించండి!

 సాధారణంగా భర్త చేసే కొన్ని పనుల కారణంగా భార్యలకు కోపం రావడం సర్వసాధారణం. అయితే భర్త పై భార్య అలిగింది అంటే భర్తకు చుక్కలు కనిపిస్తాయి.

 అయితే భార్య చాలా కోపంగా ఉన్నప్పుడు తన కోపాన్ని ఎలా తగ్గించాలి తనని తిరిగి సాధారణ స్థితికి ఎలా తీసుకురావాలి అని విషయం గురించి భర్తలు తెగ కంగారు పడుతుంటారు.

  అయితే భార్యల కోపాన్ని తగ్గించడం కోసం ఈ సింపుల్ చిట్కాలను పాటించండి. ముందుగా మీ భార్య ఏ విషయంలో కోపంగా ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి

 విషయం తెలుసుకున్న తర్వాత ఇంకొకసారి అలాంటి తప్పు జరగదని సర్ది చెప్పాలి. అలాగే మీరు చేసిన తప్పుకు చిన్న క్షమాపణ అడిగి తనని ఒంటరిగా వదిలేయాలి.

 తాను తప్పును గ్రహించి తిరిగి మీతో మాట్లాడటానికి వస్తుంది. ఇలా భార్య కోపంగా ఉన్నప్పుడు మీరు కూడా పంతానికి పోయి మాట్లాడకుండా ఉండకూడదు.

 ఆమె కోపంగా ఉన్నప్పుడు భర్తలు వంట చేయడం వల్ల భార్య కోపం తగ్గుతుంది. ఇలా భార్య కోపంగా ఉన్నప్పుడు తనకు చిన్నచిన్న కానుకలు ఇవ్వడం చేయాలి.

 అలాగే సరదాగా తనని షాపింగ్ కి తీసుకెళ్లడం, తనకు నచ్చినవి కొనివ్వడం వంటివి చేయటం వల్ల తనలో మీపై ఉన్నటువంటి కోపం తొందరగా తగ్గిపోతుంది.

 అయితే చాలామంది కోపంగా ఉన్నప్పుడు భర్త షాపింగుకు పిలిచినా కూడా రారు అలాంటి సమయంలో మీరే స్వయంగా వారికి చిన్న చిన్న గిఫ్టులు ఇవ్వటం వల్ల మీపై ఉన్న కోపం తగ్గిపోతుంది.

 అలాగే ఇంటి పనిలో కాస్త సహాయం చేయడం కూడా ఎంతో మంచిది.