యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ అన్ని కోట్ల రూపాయలా?

జూనియర్ ఎన్టీఆర్ కు క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి వెండితెరపై జూనియర్ ఎన్టీఆర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటం గమనార్హం.

ఎనిమిదేళ్ల వయస్సులోనే నటుడిగా ఎన్టీఆర్ కెరీర్ మొదలైంది.

జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం.

నిన్ను చూడాలని, స్టూడెంట్ నంబర్ 1 సినిమాల షూటింగ్ లు దాదాపుగా ఒకే సమయంలో మొదలుకాగా నిన్ను చూడాలని మొదట విడుదలైతే స్టూడెంట్ నంబర్1 సినిమా తర్వాత విడుదలైంది.

సింహాద్రి సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించిన తర్వాత రోజుల్లో తారక్ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

సినిమా రంగంలో వరుసగా ఆరు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరని చెప్పవచ్చు.

 జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ద్వారా ఏకంగా 500 కోట్ల రూపాయలు సంపాదించారని తెలుస్తోంది.

తారక్ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఒక్కో యాడ్ కు తారక్ 5 కోట్ల రూపాయల నుంచి 7 కోట్ల రూపాయల వరకు పారితోషికంగా అందుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఖరీదైన కార్లు ఉండగా ఆ కార్ల విలువ 30 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.

 నందమూరి యంగ్ టైగర్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

స్టార్ డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలను ఇస్తున్న ఎన్టీఆర్ మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.