దర్శకుడు వంశీ పైడిపల్లి తెలుగువాడే.. దిల్ రాజు సంగతి సరే సరి.! వీళ్ళిద్దరూ కలిసి తమిళ హీరో విజయ్‌తో సినిమా చేశారు.
అదే ‘వారిసు’.. తెలుగులో ‘వారసుడు’గా విడుదల కాబోతోంది. ‘వారసుడు’ సినిమా కథని తొలుత టాలీవుడ్‌లో పలువురు హీరోలకు చెప్పారట.
ఆ విషయాన్ని స్వయంగా దిల్ రాజే పలు సందర్భాల్లో చెప్పాడు. గతంలో మహేష్‌బాబుతో ‘మహర్షి’ సినిమా చేసిన వంశీ, ఆ సమయంలోనే ఈ ‘వారిసు’ కథ కూడా చెప్పాడట.
కానీ, దాన్ని మహేష్ లైట్ తీసుకున్నాడు. లేకపోతే, మహేష్ – వంశీ కాంబినేషన్‌లో ‘మహర్షి-2’ కూడా వచ్చేదే.
దానికే కొన్ని మార్పులు చేసి, ‘వారిసు’ అంటూ వదులుతున్నారు. మార్పులంటే, చిత్రమైన మార్పులవి.
నవదీప్ హీరోగా వచ్చిన ‘గౌతమ్ ఎస్ఎస్‌సి’ సహా పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, మహేష్ ‘శ్రీమంతుడు’.. ఇలా కలగాపులగం చేసేసినట్లు కనిపిస్తోంది.
‘ఇదిగో, ఇందుకే తిరస్కరించాం..’ అని ఎవరైతే తిరస్కరించారో, ఆ హీరోలిప్పుడు (తెలుగు హీరోలు) తమ సన్నిహితుల వద్ద చెబుతున్నారట.
ఏమో, సంక్రాంతి సినిమా.. హిట్టయితే.. ఆ సినిమా లాస్ అయ్యామని అదే హీరోలు బాధపడతారనే చర్చ కూడా నడుస్తోంది.