పిల్ల పిత్రేగాడంటూ చాలా తేలిగ్గా తీసుకున్నారు హైపర్ ఆది గురించి మంత్రి రోజా.
ఆమె కూడా సినీ నటి. ఓ సినీ నటుడి పట్ల ‘పిల్ల పిత్రేగాడు’ అంటూ వ్యాఖ్యలు చేయడం మంత్రిగా రోజాకి ఎంతవరకు సబబు.? అన్నది వేరే చర్చ. అది ఆమె గౌరవాన్ని పెంచదు, తగ్గిస్తుంది.
సాధారణ రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా చెల్లుతుంది. మంత్రి పదవిలో వున్నప్పుడు ఒకింత మాట జాగ్రత్తగా వుండాలి.
కానీ, రోజా నుంచి అలాంటివి ఆశించలేం. సరే, రాజకీయాల్లో రాణించాలంటే నోరు గట్టిగా వుండాలి. అది రోజాకి చాలానే వుందనుకోండి.. అది వేరే సంగతి.
ఇంతకీ, హైపర్ ఆది వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు.? తెలుగు రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్. పైగా, ఏపీలో హైపర్ ఆది ఫ్యాన్స్, ‘నువ్వు పోటీ చెయ్ అన్నా..
జనసేన నుంచి నిన్ను గెలిపించుకుంటాం..’ అంటున్నారు. పవన్ కళ్యాణ్ రేంజ్‌లో హైపర్ ఆదికి ఎలివేషన్స్ ఇస్తున్నారు.
ఎక్కడో ఎందుకు, నగిరిలో పోటీ చెయ్యొచ్చు కదా.? అంటూ కొందరు హైపర్ ఆదికి ఉచిత సలహా కూడా ఇచ్చేస్తున్నారు.
రణస్థలం జనసేన యువశక్తి వేదికపై రాజకీయ ప్రసంగం తర్వాత మళ్ళీ హైపర్ ఆది ఎక్కడా కనిపించలేదు.
సినీ రంగంలో నిలదొక్కుకునే దశలో వున్నాడు హైపర్ ఆది. సో, ఇప్పుడే రాజకీయాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తే, కెరీర్ మటాష్ అయిపోతుంది.
ఓసారి మాట్లాడినందుకే హైపర్ ఆది ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. ఎన్నికల్లో పోటీ చేసేదాకా ఆయన వెళతాడని అనుకోలేం.