చుండ్రు సమస్య తీవ్రంగా వేధిస్తోందా..? ఇంటి చిట్కాలతో ఇలా తరిమికొట్టండి!

మన నిత్య జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, వేగంగా పెరుగుతున్న వాతావరణ కాలుష్యం కారణంగా చాలామందిలో చుండ్రు సమస్య తీవ్రంగా బాధిస్తోంది.

ఫలితంగా తలలో ఇన్ఫెక్షన్ ప్రారంభమై జుట్టు సహజ గుణాన్ని కోల్పోయి రాలిపోవడం, తెల్లబడడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

అసలు చుండ్రు సమస్య అంటే ఇదో రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు. దీన్ని మలాసేజియా అని కూడా పిలుస్తారు.

చుండ్రు సమస్య లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి ముఖ్య కారణం మనం ప్రతిరోజు ఎక్కువగా కెమికల్ షాంపులను, సబ్బులను, హెయిర్ కండిషనర్ను

ఎక్కువగా ఉపయోగించడం వల్ల తలలో బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లను అదుపు చేసే సహజ గుణాలు తొలగిపోతాయి ఫలితంగా చుండ్రు సమస్య తలెత్తుతుంది.

కొందరిలో పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి మన ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

చుండ్రు సమస్యతో బాధపడేవారు యాంటీ ఫంగల్

యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉన్న కొబ్బరి నూనెతో లేదా వేప నూనెతో తలపై మసాజ్ చేసుకుంటే చుండ్రు సమస్య నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు.

ఉల్లిపాయలు మెత్తని గుజ్జులా తయారు చేసుకుని తల చర్మానికి అంటే విధంగా రాసుకుంటే ఇందులో ఉండే ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ చుండ్రు సమస్యను తొలగిస్తుంది.

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉన్న పెరుగు లేదా మజ్జిగను వెంట్రుకల కుదుళ్లుకి

అంటే విధంగా రాసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్ రసాన్ని అప్పుడప్పుడు తల చర్మానికి అంటే విధంగా అప్లై చేసుకుంటే చుండ్రు సమస్య తొలగిపోవడమే కాకుండా

వెంట్రుకలను దృఢంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది