పురుషుల్లో వీర్య లోపం, సంతానలేమి సమస్యకు కోవిడ్ 19 వైరస్ కారణం అవుతోందా!

 కరోనా వైరస్ మూడు సంవత్సరాలకు ముందు చైనాలో ఉద్భవించి తీవ్రస్థాయిలో వ్యాపించి యావత్ ప్రపంచాన్ని కకావికలం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.

 తాజాగా మరోసారి కోవిడ్ 19 బిఎఫ్ 7 కొత్త వేరియంట్ తో ప్రజల్లో భయభ్రాంతులను కలగజేస్తుంది. కోవిడ్ 19 వైరస్ సోకి కోలుకున్నవారు ఇప్పటికీ అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు

 తాజాగా కోవిడ్ 19 వైరస్ వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం , వీర్య ఉత్పత్తిలో లోపం ఏర్పడి సంతానలేమి సమస్యకు కారణం అవుతోందని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

 ఇండియాలో ప్రఖ్యాత ఆరోగ్య సంస్థ అయినా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆశ్చర్యకర ఫలితాలు వెలబడ్డాయి.

 ఈ అధ్యయనం ప్రకారం కోవిడ్ 19 సోకి కోరుకున్న తర్వాత పురుషుల్లో వృషణ కణజాలంలో పుష్కలంగా ఉండే యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్-2

 రిసెప్టర్ ద్వారా కోవిడ్-19 ఎక్కువ శాతం అవయవ నష్టానికి దారితీస్తుందని పాట్నాలోని ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం పరిశోధన ఫలితాలను వెల్లడించింది .

 వీర్యంలో సార్స్-కోవ్-2 స్పెర్మ్ ఉన్న మందపాటి, తెల్లటి ద్రవం, వీర్యం ఏర్పడటం, సంతానోత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందట.

 ఈ అధ్యయనములో 35 సంవత్సరాల లోపు వయస్సు గల 30 మంది కరోనా సోకిన పురుషులు పాల్గొన్నారు. ఈ అధ్యయనం కోవిడ్ -19 పురుషుల వీర్యంలో సార్స్-కోవ్-2 ఉనికిని పరిశోధించింది.

 ఇందులో వీర్య నాణ్యత, స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ పై వ్యాధి ప్రభావాన్ని పరిశోధకులు అంచనా వేయగా పురుషుల్లో వీర్య నాణ్యత లోపించిందని తెలిసింది.

 ఇందులో మొదటి నమూనా తీసుకున్న 74 రోజుల తరువాత మేము రెండో నమూనాను పరిశీలించారు.రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్- పాలిమరేజ్ చైన్ రియాక్షన్ తో పరీక్షించిన మొదటి,

 రెండవ నమూనాల్లో సేకరించిన వీర్య నమూనాలన్నీ సార్స్-కోవ్-2కు నెగిటివ్ అని తెలిసింది. అలాగే మొదటి నమూనాను రెండో నమూనాతో పోలిస్తే పురుషుల్లో వీర్య నాణ్యత,

 వీర్య సాంద్రత చాలా తక్కువ ఉండి సంతాన లేమి సమస్యలకు కారణం అవుతోందని ఈ పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి.