బాహుబలి సినిమాలో అనుష్క నటించడానికి కారణం అదేనా?

 టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

 ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా ద్వారా మన తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమా ద్వారా రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.

 అలాగే ఈ సినిమాలో నటించిన ప్రభాస్ కూడా పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి సినిమా వల్లే తనకు ఇంత ఇమేజ్ వచ్చిందని ఇటీవల ఒక షోలో పాల్గొన్న ప్రభాస్ స్వయంగా ఒప్పుకున్నాడు.

 ఇక బాహుబలి సిరీస్ లో ప్రభాస్ సరసన అనుష్క హీరోయిన్ గా నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

 రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో నటించిన హీరో హీరోయిన్ల తో ఆ సినిమా కోసం పని చేసిన టెక్నిషన్స్ అందరికీ కూడా ప్రత్యేక గుర్తింపు లభించింది .

 ఇదిలా ఉండగా బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి అనుష్క గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

 అసలు అనుష్క బాహుబలి సినిమాలో నటించడానికి గల కారణం గురించి గతంలో రాజమౌళి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ..”అనుష్క బాహుబలి స్టోరీ నచ్చి ఈ సినిమా చేయలేదు.

 కేవలం ప్రభాస్ వల్లే అనుష్క ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంది. సినిమా షూటింగ్ సమయంలో ఈ సినిమాను ఎందుకు యాక్సెప్ట్ చేశావు అని అనుష్కని అడిగితే….

 రమా రాజమౌళి , వల్లి, కీరవాణి, ప్రభాస్ వీళ్ళందరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అంతే కాకుండా షూటింగ్ ని మీరందరూ ఒక టూర్ లాగా..

 పిక్నిక్ లా ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను ఎలా తట్టుకుంటాను. అందుకే ఈ సినిమాని యాక్సెప్ట్ చేశానని అసలు విషయం బయట పెట్టింది.

 అప్పుడే నాకు అర్థమైంది అనుష్క నా కథ విని స్టోరీని ఓకే చేయలేదు కేవలం ప్రభాస్ తో కలిసి షూటింగ్ లో ఎంజాయ్ చేయటానికి మాత్రమే ఒకే చేసింది” అంటూ రాజమౌళి వెల్లడించాడు.