శ్రీలీల టూమచ్ చేస్తోందా.?

 ‘ధమాకా’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ముసలాడు రవితేజతో కుర్రపిల్ల శ్రీలీల రొమాన్స్ ఏంటి.?’ అన్న విమర్శలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయ్.

 చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలే యంగ్ హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తోంటే,

 రవితేజని ఈ విషయంలో ప్రత్యేకంగా క్వశ్చన్ చేయడమేంటి.?

 సరే, తెలుగు సినీ పరిశ్రమలో ఇదంతా సర్వసాధారణం. రజనీకాంత్ ఏమన్నా తక్కువ తిన్నాడా ఏంటి.?

 షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటోళ్ళ సంగతేంటి.? మొత్తంగా ఇండియన్ సినిమానే అంత.

 కానీ, ‘ధమాకా’ విషయంలో రవితేజ నానా రకాల విమర్శలూ ఎదుర్కొంటున్నాడు.

 ఈ మధ్య రవితేజ ప్రతి సినిమాకీ ఈ సమస్య వస్తోంది. ఈసారి ఇంకాస్త పెద్దదయ్యిందీ సమస్య.

 శ్రీలీలకి కర్నాటకలో అభిమానులెక్కువ. ఆ అభిమానులే రవితేజని ట్రోల్ చేస్తున్నారు.

 వారిని శ్రీలీల కంట్రోల్ చేయలేకపోతోందా.? అని రవితేజ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు.

 ఫాఫం.. శ్రీలీల మాత్రం ఏం చేస్తుంది.? అభిమానుల్ని ఆమె ఎలా కంట్రోల్ చేయగలదు.?