టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ప్రేమమ్ సినిమా ద్వారా తన సినీ కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టింది.
ఈ సినిమా మంచి హిట్ అవటంతో తెలుగు తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది.
ఇక అందరి హీరోయిన్ల లాగా కాకుండా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తూ నాచురల్ బ్యూటీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.
ఇటీవల గార్గి సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న సాయి పల్లవి ఆ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకపోవడంతో ఈమె సినీ ప్రయాణం గురించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సాయి పల్లవి సినిమాలకు దూరమై పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా సాయి పల్లవి గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గార్గి సినిమా తర్వాత సాయి పల్లవికి మంచి ప్రాజెక్టులు వచ్చినా కూడా ఆమె అంగీకరించడం లేదు.
అంతే కాకుండా రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కించే చిత్రంలో కూడా సీతగా అవకాశం వచ్చినా సరే ఈమె రిజెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో సాయి పల్లవి సినిమాలకు స్వస్తి చెప్పి తాను డాక్టర్గా స్థిరపడాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో సొంతంగా ఒక హాస్పిటల్ నిర్మించి డాక్టర్ గా సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇటీవల స్పందించిన సాయి పల్లవి ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చింది. ” అందం అన్నది రూపంలో కాదు.. గుణంలో ఉందని చెప్పే ప్రేమమ్ సినిమా ద్వారా నా సినీ ప్రయాణం మొదలైంది.
ఆ సినిమాలో నేను నటించిన టీచర్ ఇమేజ్ ను మార్చడానికి కొత్త తరహా పాత్రలో నటించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను.
నేను ఎంబిబిఎస్ చదివినప్పటికీ నటిని కావాలనుకున్నాను. మా అమ్మ, నాన్న ఏ రోజు నా కోరికకు అడ్డు చెప్పలేదు. అలాగే నేను నటించిన సినిమాలు, పాత్రలు ప్రేక్షకులకు నచ్చాలనే అశపడతాను.
ఒక మంచి కథ లభిస్తే భాషాతో సంబంధం లేకుండా కచ్చితంగా నటిస్తాను ” అంటూ క్లారిటీ ఇచ్చింది.