నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ‘ఆహా’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో లేటెస్ట్ ఎపిసోడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా జరిగింది.
బాలయ్య మేగ్జిమమ్ ఫన్ సృష్టించడానికి ట్రై చేశాడు. ప్రభాస్ తనవంతుగా చేయాల్సిందంతా చేశాడు.
కానీ, ఔట్‌పుట్ సరిగ్గా రాలేదన్న విమర్శలున్నాయి. డిజాస్టర్ షో.. అనేస్తున్నారు కొందరు.
ప్రభాస్ అభిమానుల్లోనూ ఈ డివైడ్ టాక్ వుంది. ‘షో అదిరిపోయింది’ అనేవారూ వున్నారు, ‘చెత్తలా వుంది’ అనేవారూ వున్నారు.
ఫస్ట్ పార్ట్ మాత్రమే స్ట్రీమింగ్ అయ్యింది. రెండో పార్ట్ కొత్త సంవత్సరంలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఫస్ట్ పార్ట్‌కి వచ్చిన రెస్పాన్స్, ఆ పార్ట్ వచ్చిన విధానం.. వీటిపై ప్రభాస్ ఏమంత హ్యాపీగా లేడట.
టెక్నికల్ సమస్యతో మొత్తంగా యాప్ క్రాష్ అవడాన్ని సైతం ప్రభాస్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడని సమాచారం.
మరోపక్క, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తమ అభిమాన నటుడి ఎపిసోడ్ ఎలా వుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
హైప్ క్రియేట్ చేసినంత మెటీరియల్ అయితే, అన్‌స్టాపబుల్‌లో వుండటంలేదు. కారణమేంటో ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది ‘ఆహా’ నిర్వాహకులే.