మొట్టమొదటిసారి పవన్ సినిమా ఇలా రాబోతోందా?

 గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ పవర్ ఫుల్ సబ్జెక్టు లలో

  తన మొదటి భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” చిత్రం కూడా ఒకటి.

 కాగా ఈ సినిమాని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇది పవన్ నుంచి మొదటి పాన్ ఇండియా సినిమా అలాగే మొదటి హైయెస్ట్ బడ్జెట్ సినిమా కూడా

 ఇదే కావడంతో పవన్ ఫ్యాన్స్ లో ఈ సినిమాకి భారీ హైప్ తన అభిమానుల్లో ఉంది.

 మరి ఇదిలా ఉండగా ఇదే సినిమాపై ఓ సూపర్ అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా స్టార్ట్ అయ్యింది.

 మరి ఇది కూడా పవన్ నుంచి మొట్టమొదటి స్టెప్ అనే తెలుస్తుంది. అదే పవన్ నుంచి ఈ భారీ సినిమా రెండు భాగాలుగా వచ్చే ఛాన్స్ ఉందట.

 ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలు సీక్వెల్స్ ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేసే ఛాన్స్ చాలా ఉన్నట్టుగా నయా క్రేజీ బజ్.

 దీనితో ఇదే నిజం అయితే పవన్ మొట్ట మొదటి రెండు భాగాలుగా రిలీజ్ అయ్యే సినిమా ఇదే అని చెప్పుకోవాలి.

 కాగా ఈ భారీ సినిమాలో అయితే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా పలువురు బాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ కేటాయించి నిర్మాణం వహిస్తున్నారు.