“వాల్తేరు వీరయ్య” కి మళ్ళీ అడ్డు చెప్పడానికి పవన్ కారణమా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమానే “వాల్తేరు వీరయ్య”.

కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కించగా మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో అయితే నటించారు.

మరి ఇదిలా ఉండగా ఈ అవైటెడ్ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం నుంచి అడ్డంకులు తప్పలేదు.

ఒకోసారి ఒకో దగ్గర పర్మిషన్ అంటూ పలు మార్లు చిత్ర యూనిట్ ని కన్ఫ్యూజన్ లో పెట్టేసింది. అయితే ఇది వరకు ఎన్నో ఈవెంట్ లో వైజాగ్ బీచ్ దగ్గర జరిగాయి.

భారీ ఎత్తున జనం కూడా వచ్చారు. మరి వాల్తేరు వీరయ్య కి కూడా అలాగే వస్తారని అందుకే అక్కడ జరపట్లేదు ప్రజల ప్రాణాలు ముఖ్యం అంటూ కొత్త రూల్స్ లో చేస్తున్నారు.

కానీ ఈ పర్మిషన్స్ లు ఇవ్వకుండా ఉండడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కారణం అంటూ కొన్ని గాసిప్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గ్రాండ్ ఈవెంట్ కి పవన్ చీఫ్ గెస్ట్ గా వచ్చే అవకాశం

ఉందని తెలియడంతో మళ్ళీ ఆర్ కే బీచ్ పర్మిషన్ ని వెనక్కి తీసుకొని మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లోనే అనుమతి ఇచ్చారని లేటెస్ట్ గా వినిపిస్తున్న కొన్ని రూమర్స్.

దీనితో పవన్ మూలాన వాల్తేరు వీరయ్య ఈవెంట్ కి ఆర్ కె బీచ్ లో అనుమతి దక్కలేదు అని భోగట్టా..

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా జనవరి 13న సినిమా రిలీజ్ కాబోతుంది.