కాజల్ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారా…. బొద్దుగా తయారైన చందమా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి, వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి పరిచయం అవసరం లేదు. 

దాదాపు దశబ్దన్నర కాలం నుంచి ఇండస్ట్రీలో పలు భాషలలో సినిమాలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్న కాజల్ ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చారు.

పెళ్లి తర్వాత ఈమె కొద్ది నెలలకే ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకు విరామం ప్రకటించి పూర్తిగా తను మాతృత్వాన్ని ఎంజాయ్ చేశారు. 

ఇక కాజల్ ఏడది ఏప్రిల్ 19వ తేదీ పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చారు. ఇక తన కుమారుడికి నీల్ కిచ్లు అని నామకరణం కూడా చేశారు.

ఇలా బాబు జన్మించిన కొన్ని నెలలకు ఈమె పూర్తి వ్యాయామాలు చేస్తూ బాగా సన్నబడి తిరిగి ఇండస్ట్రీలో తిరిగి ఎంట్రీ ఇచ్చారు. 

ఇక ఈమె భారతీయుడు 2 సినిమాలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

అయితే గత కొంతకాలంగా కాజల్ అగర్వాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరొక వార్త చక్కర్లు కొడుతుంది.

కాజల్ ఈ ఫోటోలలో కాస్త బొద్దుగా ఉండడంతో ఈమె మరోసారి ప్రెగ్నెంటా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే కాజల్ షేర్ చేసిన ఫోటోలపై కొందరు స్పందిస్తూ కాజల్ రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

మరి కాజల్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.