ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యేలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. పైకి మంచిగా కనిపించే ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆకృత్యాలు అన్నీఇన్నీ కావు.
ఈ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసినా ఓడించాలని జనం ఫిక్స్ అయ్యారు. ప్రధానంగా 15 మంది ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారని సమాచారం అందుతోంది.
10 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాలేదని తెలుస్తోంది. ఈ 15 మంది ఎమ్మెల్యేలకు జగన్ షాకివ్వబోతున్నారని సమాచారం అందుతోంది.
ఈ ఎమ్మెల్యేల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని జగన్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.
ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రజల మనస్సును గెలుచుకోవడంలో విఫలం కావడంతో పాటు ప్రజలకు కొత్త ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ప్రజల భూములపై కన్నేయడంతో పాటు తక్కువ డబ్బుకే వాటిని కొనుగోలు చేసి ప్రజలకు నష్టం కలిగేలా చేస్తున్నారు.
కోర్టులను, పోలీసులను ఆశ్రయించినా తమకు న్యాయం జరగదని భావించి కొంతమంది అధికార పార్టీ నేతలకు ఎదురు చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు.
సీఎం జగన్ సైతం అలర్ట్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సీఎం జగన్ 175 సీట్లలో విజయం సాధించాలని భావిస్తున్న నేపథ్యంలో ఎలాంటి రిస్క్ తీసుకోవాలని భావించడం లేదని సమాచారం అందుతోంది.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలకు షాకివ్వడానికి జగన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జగన్ ప్రతి అడుగు వెనుక సరైన ప్రణాళిక ఉందని బోగట్టా.
తనపై విమర్శలు చేసేవాళ్లను జగన్ పట్టించుకోవడం లేదు. అయితే పార్టీకి నష్టం కలిగించే వాళ్ల విషయంలో మాత్రం జగన్ మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది.