‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ వారసుడొచ్చేసినట్లేనా.?

అకిరానందన్ తెరంగేట్రం ఎప్పుడు.? ఈ ప్రశ్న పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతూనే వుంది.

నిజానికి, అకిరానందన్ ఇంకా చాలా చిన్న పిల్లాడు. హైట్ బాగా పెరిగిపోయాడుగానీ, హీరో అయ్యేంత వయసు అయితే రాలేదు.

కానీ, తాజాగా ‘ఖుషి’ రి-రిలీజ్ సందర్భంగా అకిరానందన్, ఆ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్‌కి వెళ్ళడంతో,

కెమెరాలన్నీ అతని వైపే పరుగులు పెట్టాయి. ‘వారసుడొచ్చేశాడు’ అంటూ మీడియా హైప్ ఇవ్వడంతో, అభిమానుల్లోనూ ఉత్సాహం పెల్లుబికింది.

ప్రస్తుతం అకిరా, ఓ వైపు చదువుకుంటూనే, ఇంకో వైపు సినిమాకి సంబంధించి నేర్చుకోవాల్సినదంతా నేర్చుకుంటున్నాడట.

తండ్రిలానే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు.. అదనంగా సంగీతం మీద కూడా ఫోకస్ పెట్టాడు. డాన్సుల్లోనూ ప్రావీణ్యం వుందట.

కానీ, అకిరానందన్‌ని ఎవరు హీరోగా పరిచయం చేస్తారు.? కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అకిరాని పరిచయం చేయడమైతే ఖాయం.

దర్శకుడి విషయంలో పవన్ కళ్యాణ్ ముందు ముందు నిర్ణయం తీసుకోవచ్చునట. ఎటూ పవన్ రాజకీయాల్లో మరింత బిజీ అవుతాడుగనుక, ఏడాది, రెండేళ్ళలోనే వెండితెరపై అకిరాని హీరోగా చూడొచ్చు.