కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభమా… అలా జరిగితే సమస్యలు తప్పవా..?

 సాధారణంగా శుభకార్యాలు, పూజా కార్యక్రమాలు చేసినప్పుడు కొబ్బరికాయని తప్పకుండా ఉండాలి. కొబ్బరికాయ లేకుండా చేసి ఆ శుభకార్యాలు పూజా కార్యక్రమాలు అసంపూర్ణమని చెప్పవచ్చు.

 పూజలు కొబ్బరికాయ కు చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల పూజానంతరం చివరికి కొబ్బరికాయ కొట్టి పూజ ముగిస్తారు. కొబ్బరికాయల్లో ఉండే నీటిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

 అందుకనే కొబ్బరికాయ కొట్టి ఆ దేవుడికి నైవేద్యంగా పెడతారు. కొబ్బరికాయలకు ఉండే మూడు కళ్లను పరమేశ్వరుడి కళ్లుగా భావిస్తారు.

 అందువల్ల కొబ్బరికాయను కొట్టేముందు దాన్ని శుభ్రం చేసి మనస్పూర్తిగా మంచి జరగాలని దేవుడికి దండం పెట్టి ఆ తర్వత కొబ్బరికాయ కొట్టాలి.

 అయితే ఇక కొబ్బరికాయ కొట్టే రాయి కూడా ఆగ్నేయ ముఖంగా ఉంటే మంచిది. కొబ్బరికాయ కొట్టే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

 సాధారణంగా కొందరు కొబ్బరికాయలను కొట్టాక వాటిని విడదీయకుండా అలాగే ఉంచుతారు. కానీ అలా చేయరాదు. వెంటనే కొబ్బరికాయను విడదీసి రెండు చెక్కలను ఇరువైపులా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి.

 అయితే కొన్ని సందర్భాలలో మనం ఇంట్లో కానీ దేవాలయాలలో కానీ కొట్టే కొబ్బరికాయలు కుళ్ళిపోతూ ఉంటాయి.

 అలా కొబ్బరికాయ కుళ్ళిపోవటం వల్ల అశుభం జరుగుతుందని ప్రజలు భయపడుతూ ఉంటారు. కానీ అది నిజంకాదని పండితులు చెబుతున్నారు.

 ఒక వేళ టెంకాయ కుళ్లిపోయి మళ్లీ స్నానం చేసి వచ్చి మరొక కొబ్బరికాయను కొట్టాలి. వాహనాలకు పూజ చేసే సమయంలో కొబ్బరికాయ కొట్టినా ఇదే నియమం వర్తిస్తుంది.

 వాహనాన్ని మళ్లీ శుభ్రంగా కడిగి, భక్తులు తాము కూడా స్నానం చేసి మళ్లీ ఓ కొత్త కొబ్బరికాయను కొట్టాల్సి ఉంటుంది.

 ఇక టెంకాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే కోరిన కోరికలు తీరుతాయట. నూతన వధూవరులకు పువ్వు వస్తే వారికి సంతానం త్వరగా కలుగుతుందని నమ్ముతారు.

 ఇక కొబ్బరికాయ నిలువుగా పగిలితే ఆ భక్తుల ఇంట్లో వారికి త్వరగా సంతానం కలుగుతుందని చెబుతారు.