వైసీపీలో ఆ మాజీ మంత్రులకు షాక్ తప్పదా.?

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు మాజీ మంత్రులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసహనంతో వున్నారట.

 ఎవరా మాజీ మంత్రులు.? అంటే, అందులో ఇద్దరు ఒకే సామాజిక వర్గమట. మొత్తంగా ఈ ముగ్గురు నేతల్లో, ఇద్దరేమో పార్టీ మారడానికి తెరవెనుకాల కసరత్తులు చేస్తున్నారట.

 ఒకాయన మాత్రం వైసీపీలోనే వుండాలనుకుంటున్నారుగానీ, వైసీపీ అధినాయకత్వం ఆయన మీద గుర్రుగా వున్నట్లు తెలుస్తోంది.

 ఒకాయన మాత్రం వైసీపీలోనే వుండాలనుకుంటున్నారుగానీ, వైసీపీ అధినాయకత్వం ఆయన మీద గుర్రుగా వున్నట్లు తెలుస్తోంది.

  ఎందుకిలా.? అంటే, మంత్రి పదవులు పోగానే, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం తగ్గించేశారట ఆ ముగ్గురు మాజీ మంత్రులు.

 అందులో ఇద్దరైతే అసలు మీడియాకి కనిపించడమే మానేశారు. నియోజకవర్గాల్లోనూ వుండటంలేదు.

 దాంతో, ఆ ముగ్గురికీ షాక్ ఇవ్వాలనే నిర్ణయానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చారని తెలుస్తోంది.

 ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జి మార్పు దిశగా సమాలోచనలు చేస్తున్నారట అధినేత వైఎస్ జగన్.

 అందులో ఒకరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే అంటున్నారు. ఇంకొకాయన ఉత్తరాంధ్రకు చెందిన నేత అట.

 మరొకాయన విషయమై సస్పెన్స్ నడుస్తోంది. ఈ నెలాఖరులోగా ఆ ముగ్గురికీ జగన్ మార్కు షాక్ తగలబోతోందిట.

 కాగా, ఆ ముగ్గురిలో ఇద్దరు ఇప్పటికే జనసేన పార్టీతో టచ్‌లోకి వెళ్ళారనీ, ఆ ఇద్దరిలో ఒకరు ఇటు జనసేనతోనూ, అటు టీడీపీతోనూ టచ్‌లో వున్నాడనీ అంటున్నారు.