పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన విధానంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి
వాటిల్లో యువతరం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు అధికంగా రాలిపోయి బట్టతల ఏర్పడడం.
జుట్టు రాలడానికి గల కారణాలను తెలుసుకుంటే సులువుగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
ముఖ్యంగా వంశపార్యంపర్యంగా వచ్చే జన్యుపరమైన కారణాల వల్ల జుట్టు అధికంగా రాలి బట్టతల సమస్య తలెత్తడం జరగవచ్చు.
ఇలాంటివారు ముందుగా మేలుకొని తగిన వైద్య సలహాలు తీసుకున్నట్లయితే సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.
ఈ రోజుల్లో యువతరం ప్రధానంగా ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యల వల్ల జుట్టు ఊడి బట్టతల సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు.
అధిక ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టికోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి మోతాదుకు మించి పెరగడం వల్ల వెంట్రుకల ఊత్పత్తి కణాలను క్రియారహితంగా మారుస్తుంది.
దీంతో జుట్టు కణవిభజన సరిగా జరగక జుట్టు పెరుగుదల తగ్గి, జుట్టు రాలే సమస్య అధికం అయ్యి చివరకు బట్టతల ఏర్పడుతుంది.
శరీరంలో ఆండ్రోజెన్ హార్మోన్ ఊత్పత్తి పెరిగినప్పుడు కూడా జుట్టు రాలడం, పల్చగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
పోషకాహార లోపం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో పాటు ఐరన్ లోపం ఏర్పడి జుట్టు రాలడానికి ప్రధాన కారణంగా మారుతుంది.
రక్తహీనత సమస్య వల్ల హార్మోన్ లో వ్యత్యాసం ఏర్పడి జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మహిళల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జుట్టు ఆరోగ్యానికి అవసరమయ్యే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ఊత్పత్తి తగ్గుతుంది.
ఒక్కొక్కసారి హార్మోన్స్ పనితీరు వ్యత్యాసం వల్ల యుక్త వయసులోనే ఈ సమస్య తలెత్తి జుట్టు హెయిర్ ఫాల్ ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో చిన్న వయసులోని బట్టతల సమస్య ఏర్పడుతుంది.