పవన్ ఫ్యాన్స్ కు ఏబీఎన్ ఆర్కే భయపడ్డాడా.. అందుకే అలా క్షమాపణలు చెప్పాడా?

 ప్రముఖ పత్రికాధినేతలలో ఒకరైన ఏబీఎన్ ఆర్కే ఊహాజనితమైన కథనాలను ప్రచురించే విషయంలో ముందువరసలో ఉంటారు.

 ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కించపరిచే విధంగా ఆయన కథనాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం పవన్ కు కేసీఆర్ నుంచి 1000 కోట్ల రూపాయల ప్యాకేజ్

 అందిందనే అర్థం వచ్చేలా ఏబీఎన్ ఆర్కే ప్రచురించిన కథనం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

 ఆ కథనాన్ని నాగబాబు సైతం ఖండించడంతో పాటు ఒకింత ఘాటుగా రియాక్ట్ అయ్యారనే సంగతి తెలిసిందే. అయితే ఈ వారం ఆర్కే గత వారం కథనానికి సంబంధించి వివరణ ఇచ్చారు.

 చంద్రబాబు సూచనల మేరకు ఏబీఎన్ ఆర్కే ఈ విధంగా పరోక్షంగా క్షమాపణలు చెప్పారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

 అయితే నాగబాబుపై మాత్రం తన కోపాన్ని ఏబీఎన్ ఆర్కే అదే విధంగా కొనసాగించారు.

 గతంలో చిరంజీవి గురించి నెగిటివ్ ప్రచారం ప్రచారం చేసిన ఆర్కే ఇప్పుడు పవన్ విషయంలో కొన్నిసార్లు పాజిటివ్ గా కొన్నిసార్లు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

 ప్రజారాజ్యం పెట్టిన సమయంలో జరిగిన తప్పులే జనసేన విషయంలో కూడా జరుగుతున్నాయని ఏబీఎన్ ఆర్కే పేర్కొన్నాఅరు.

 జన సైనికులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నారని ఆర్కే కామెంట్లు చేయడం గమనార్హం. ఆర్కే వివరణతో జనసైనికులు సైలెంట్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.  క్రిష్ ని టెన్షన్ పెడుతున్న పవన్ కళ్యాణ్

 ఆర్కే క్షమాపణలు చెప్పడమే ఆశ్చర్యం అని కొంతమంది చెబుతున్నారు. నాగబాబు ప్రకటనలు జనసేనకు కొంతమందిని దూరం చేస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నయి.