ఇన్విటేషన్… టీడీపీలోకి రేవంత్ రెడ్డి!

 తెలంగాణలో టీ.టీడీపీ గత రెండు రోజులుగా వార్తల్లో కనిపిస్తుంది. ఇంతకాలం అసలు ఆ పార్టీ ఉందా.. ఉంటే,

 ఆ పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ ఎవరు వంటి ప్రశ్నలు ఎదురయ్యేయి. కానీ.. కాసాని జ్ఞానేశ్వర్ కు ఆ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.

 ఈ క్రమంలో నిత్యం ఏదో ఒక టాపిక్ తో మీడియాలో తెలంగాణ టీడీపీ పేరు వినిపించేలా చేస్తున్నారు జ్ఞానేశ్వర్!

 అందులో భాగంగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాసాని జ్ఞానేశ్వర్.

 హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్న జ్ఞానేశ్వర్… తెలుగుదేశం పార్టీని తల్లిగారి పార్టీ అంటున్న రేవంత్ రెడ్డి,

 తిరిగి టీడీపీలోకి రావాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం…

 ఒక పార్టీ చీఫ్ గా ఉన్న వ్యక్తిని తిరిగి తమ పార్టీలోకి రావాలని కోరడం జ్ఞానేశ్వర్ కే చెల్లిందని

 ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు! కాగా… తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని..

 ఇందులో భాగంగా పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపిన సంగతి తెలిసిందే.

 ఇందులో భాగంగా ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే!!