మనం మన జీవన విధానం కారణంగా,ఉద్యోగాల కారణంగా అయినా మరే ఇతర ఒత్తిడి కారణంగా ఆయన సరే తక్కువ సమయం పాటు నిద్ర పోవడం జరుగుతుంది.
కానీ మన వైద్యులు మాత్రం మనకు దాదాపు ఎనిమిది గంటల సమయం పాటు నిద్ర అవసరమని తెలుపుతున్నారు.
తక్కువ సమయం పాటు నిద్ర పోవడం వలన మనం అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వైద్య సర్వేలు తెలియజేస్తున్నాయి.
ఇలా తక్కువ సమయం పాటు నిద్ర పోవడం వలన కళ్ళమీద ఒత్తిడి పెరిగి నిద్రలేమి, సైట్, అలాగే చాలా రకాల కంటి సమస్యలు, వంటివి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందట.
తక్కువ నిద్ర కారణంగా బలహీనంగా మారిపోవడం మెదడు పనితీరు చురుకుదనం తగ్గి పోవడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.
వీటితో పాటు దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం కూడా ఉందట వైద్య పరీక్షలు తెలియజేస్తున్న దాని ప్రకారం తక్కువ సమయం పాటు నిద్ర పోవడం వలన జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కూడా రావచ్చును.
అంతేకాకుండా స్మార్ట్ ఫోన్లో ఉపయోగం వలన కూడా తక్కువగా నిద్ర పోవడం జరుగుతుంది. ఈ కారణంగా కంటి చూపు మందగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
కావున ఎక్కువ సమయం నిద్రపోవడం వలన మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు కంటి సమస్యల నుంచి ఇంకా కొన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చును
మన జీవితాన్ని సుఖవంతం చేసుకోవడానికి రోజుకు 8 గంటలపాటు నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర అనేది మన శరీరంలో జరిగే జీవ ప్రక్రియలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది కనుక ప్రతి ఒక్కరూ 8 గంటల పాటు నిద్రపోవడం ఎంతో మంచిది.