ఇండస్ట్రీ టాక్ : “వాల్తేరు వీరయ్య” ని కావాలనే లైట్ తీసుకుంటున్నారా?

తెలుగు సినిమా దగ్గర అగ్ర హీరో నెంబర్ 1 స్థానంలో దాదాపు మూడు దశాబ్దాలు కొనసాగిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి.

మరి అలాంటి స్టార్ సినిమా ఇప్పటికీ ఎలా లేదన్నా ఈజీగా 70 నుంచి 100 కోట్లకి పైగా బిజినెస్ ను చేస్తుంది. తన తో ఉన్న ఏ హీరోకి లేని క్రేజ్ కానీ మార్కెట్ కానీ చిరు కి ఉంది.

అయితే కొన్ని ప్లాప్ లు పడినప్పటికీ తన మార్కెట్ ఏమంత పడిపోలేదు. కానీ పోటీ అనేది మాత్రం గట్టిగా ఉంది.

ఇక ఇదిలా ఉండగా ఓకే బ్యానర్ లో ఇప్పుడు చిరంజీవి “వాల్తేరు వీరయ్య” అలాగే మరో సినిమా బాలయ్యతో “వీరసింహా రెడ్డి” సినిమాలు చేస్తున్నారు.

ఐతే ఇలా ఇద్దరు బిగ్ స్టార్స్ సినిమాలు చేస్తున్నప్పుడు ఏ హీరో సినిమాకి ప్రమోషన్స్ లు ఉండాలి ఏ సినిమాపై కేర్ ఉండాలి అనేది అందరికీ తెలుసు పోనీ సమానంగా అయినా చేయాలి

అనే అంశంతో చూసినా వాల్తేరు వీరయ్య కన్నా వీరసింహా రెడ్డి కె ఎక్కువ జాగ్రత్తలు భారీ ప్రమోషన్స్ లు చేస్తుండడం ఆసక్తిగా మారింది.

అయితే చిరు సినిమా ఎలా అయినా లాస్ట్ కి హైప్ వస్తుందో ఏమో అనుకున్నారు కానీ బాలయ్య సినిమాతో పోలిస్తే కాస్త లైట్ తీసుకున్నట్టే అనిపిస్తుంది.

బాలయ్య సినిమాకి టైటిల్ ని లాంచ్ చెయ్యడానికి ఈవెంట్ చేయడం సాంగ్స్ థియేటర్స్ లో లాంచ్ చెయ్యడం వంటివి చిరు సినిమాకి మాత్రం చేయలేదు మైత్రి మేకర్స్.

దీనితో చిరు సినిమాని కావాలనే లైట్ తీసుకుంటున్నారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకి దారి తీసింది.