లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతులు అవ్వాలంటే కర్పూరంతో ఇలా చేస్తే చాలు..?

 సాధారణంగా కర్పూరాన్ని పూజ ముగిసిన తర్వాత దేవుడికి హారతి ఇవ్వటానికి ఉపయోగిస్తారు. కర్పూరంతో దేవుడికి తుది హారతి ఇవ్వకపోతే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది.

అయితే ఈ కర్పూరంతో దేవుడికి హారతి ఇవ్వటమే కాకుండా కర్పూరం ఉపయోగించి కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల కూడా ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి.

 ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి అనేక రకాల పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటారు.

 వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి కర్పూరంతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

 కర్పూరంతో ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనుషులకు ఇతరుల దృష్టి పడటాన్ని నరదృష్టి అని అంటారు.

 ఇలా నరదృష్టి తగలటం వల్ల వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలా నరదృష్టి తగిలిన వారికి ఒక కర్పూరం ముక్కని తీసుకొని చెడు దృష్టితో తల నుండి పాదాల వరకు సవ్య దిశలో మూడు సార్లు తిప్పి… ఆ తర్వాత కర్పూరం నేలపై ఉంచి కాల్చాలి.

 ఈ విధంగా చేయడం వల్ల దిష్టి దోషం తొలగిపోయి సమస్యల సుడిగుండం నుండి బయటపడతారు.

 అదేవిధంగా ఇంట్లో సానుకూల వాతావరణం కోసం కర్పూరాన్ని నెయ్యిలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాల్చడం వల్ల సువాసనతో పాటు ఇంటిలో సానుకూల శక్తి లభిస్తుంది.

 అలాగే ప్రతిరోజు రాత్రి సమయంలో వంట ముగించిన తర్వాత ఓ వెండి గిన్నెలో కొన్ని లవంగాలు, కర్పూరాన్ని వేసి కాల్చాలి.

 ఇలా ప్రతిరోజూ ఈ పరిహారాన్ని చేయడం వల్ల వారి జీవితంలో ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తుంది.

 ప్రతిరోజు ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా సిరిసంపదలు కూడా వస్తాయి.