సాధారణంగా ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో సిరిసంపదలతో ఉండాలని భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. ఇలా సోమవారం శివుడు మంగళవారం అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.
అయితే అందరి దేవుళ్లకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవారు. శని దేవుడికి పూజ చేయడం వల్ల శనీశ్వరుడు మనపై తన ప్రభావం చూపుతారని
ఇలా శని ప్రభావం మనపై పడితే కోలుకోవడం చాలా కష్టమని భావిస్తారు. ఇకపోతే శని దేవుడు ఎవరికి పడితే వారికి శిక్షలు ఇవ్వరు ఎవరైతే కర్మలను చేసే ఉంటారో వారి కర్మలకు తగ్గ ఫలితాన్ని అందిస్తారు
అందుకే ఆయనని కర్మఫలదాత అని కూడా పిలుస్తారు.ఇకపోతే మనం చేసిన కర్మలకు ఫలితంగా శని ప్రభావం మనపై ఉన్నప్పుడు ఆశని ప్రభావం నుంచి బయటపడటం కోసం
శనీశ్వరుడిని ఈ విధంగా పూజిస్తే తొందరగా ఆ బాధ నుంచి బయటపడవచ్చు. శని ప్రభావం ఒక పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి పై తప్ప ఇతరులపై తన ప్రభావాన్ని చూపించారు.
అందుకే శని ప్రభావం ఉన్నవారు శివునితోపాటు ఆంజనేయ స్వామిని కూడా పూజించడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది.
పురాణాల ప్రకారం రావి చెట్టుకు ప్రతి శనివారం పూజ చేయడం వల్ల శని ప్రభావం మనపై ఉండదని పండితులు చెబుతున్నారు.
శనివారం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయను అక్కడే వదిలేసి రావాలి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం మనపై ఉండదు.
అందుకే శనివారం హనుమాన్ చాలీసా చదవడం వల్ల శని ప్రభావం తొలగిపోతుందని చెప్పాలి భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల శని తొలగిపోతుంది.