ప్రస్తుత కాలంలో డబ్బుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఏ పని జరగాలన్నా కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు.
అయితే కొంతమంది ఎంత కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించినా కూడా ఆ డబ్బు మొత్తం ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ ఉంటుంది.
అయితే కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో నిలవాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం పొందాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలి.
సిరిసంపదలకు ప్రతీక అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనానికి లోటు ఉండదు.
అయితే సంపాదించిన డబ్బు అలాగే ఉండాలంటే బీరువాలో కొన్ని వస్తువులు ఉంచాలి.
లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపాదించిన డబ్బు ఖర్చవ్వకుండా ఉండాలంటే బీరువాలో ఏ వస్తువులు ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రజలు అనేక రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు.
ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులతో పూజ చేసి ఆ పువ్వుని బీరువాలో డబ్బు నగలు ఉంచి ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
అయితే ప్రతిరోజు తాజా తామర పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత బీరువాలో ఉంచాలి.
ఇదిలా ఉండగా దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ప్రజలందరూ అనేక రకాల పూజలు చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి పండుగకు ఒక రోజు ముందు వెండి , బంగారు వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు.
అలాగే దీపావళి పౌర్ణమి రోజున పసుపు ముద్ద తయారుచేసి దానిని లక్ష్మీదేవిగా భావించి పూజలు చేయాలి.
పండుగ పూర్తయిన తర్వాత ఆ పసుపు ముద్ద ని బీరువాలో డబ్బులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది.
అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రంలో 12 నాణేలను ఉంచి పూజ చేసి ఆ తర్వాత వాటిని ముడివేసి బీరువాలో డబ్బులు పెట్టెలో ఉంచడం వల్ల కూడా ఇంట్లో ధనానికి లోటు ఉండదు.
ఇలా బీరువాలో ఎర్రటి వస్త్రం, పసుపు ముద్ద,తామర పువ్వు ఉంచటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.