భవిష్యత్తులో రక్తపోటు ముప్పు నుంచి బయట పడాలంటే…ఈ నియమాలు కచ్చితంగా పాటించాలి!

 ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న అధిక రక్తపోటు (హై బీపీ )సమస్యకు ప్రధాన కారణం

 మన జీవన విధానంలో సంతరించుకుంటున్న సమూలమైన మార్పులు,ఆహారపు అలవాట్లే కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

 అధిక రక్తపోటు కారణంగా ప్రతి ఏడాది గుండెపోటు ప్రమాదంతో మరణించే వారి సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

 అధిక రక్తపోటు గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చిన్న వయసులో చాలామంది ఎదుర్కొంటున్న రక్తపోటు సమస్యకు కారణాలు

ఈ సమస్య నుంచి బయట పడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

 మన రోజువారి ఆహారంలో అధిక కొవ్వు పదార్థాలు కలిగిన ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింకును అధికంగా తీసుకుంటే శరీరంలో శరీరంలో కొవ్వు నిల్వలు మోతాదుకు మించి పెరిగిపోయి ఉబకాయ సమస్య ఏర్పడుతుంది.

 ఫలితంగా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి రక్త పోటు సమస్యకు దారితీయవచ్చు. కనుక రోజువారి ఆహారంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే

 అమినో ఆమ్లాలు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా కలిగిన కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నించండి.

 అలాగే గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇందులో ఉండే హానికర పదార్థాలు మన నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపి

 మానసికంగా ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి సమస్య తలెత్తి భవిష్యత్తులో తీవ్రమైన రక్తపోటు, గుండెపోటు ప్రమాదానికి దారితీస్తుంది.

 మీరు తీసుకునే ఆహారంలో ప్రతిరోజు ఉప్పు శాతం అధికంగా ఉంటే కచ్చితంగా భవిష్యత్తులో హై బీపీ సమస్య తలెత్తి గుండెపోటు ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 కావున మన రోజువారి ఆహారంలో ఉప్పు ,కారం సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే రెడ్ మీట్ ,మాంసము, డైరీ ప్రొడక్ట్స్ తినడం కంట్రోల్ చేసుకోవాలి.

  అలాగే కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక, యోగా, ఎక్ససైజ్ వంటివి అలవాటు చేసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది తద్వారా హై బీపీ సమస్యను అదుపులో ఉంచవచ్చు.