చలికాలంలో మరింత చురుగ్గా ఉండాలంటే… ఈ ఆహార పదార్థాలు తీసుకోవాల్సిందే!

 ఈ శీతాకాలం సీజన్లో రోజురోజుకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో మన ఆరోగ్యం మరియు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా ప్రమాదకర బ్యాక్టీరియా వైరస్ సూక్ష్మజీవుల తాకిడి ఎక్కువగా ఉండి అనేక ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంటాయి

 దానికి తోడు మనలో జీవక్రియ రేటు తగ్గి వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుంది ఫలితంగా మనలో బద్ధకం నీరసం వంటి సమస్యలు తలెత్తి మన రోజువారి కార్యకలాపాల్లో చురుకుతనం తగ్గి తొందరగా నిరసించి పోతాం.

 రోజు వారి ఆహారంలో కొన్ని నియమాలు పాటిస్తే రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

 సీజనల్గా లభించి అన్ని రకాల పండ్లను, కూరగాయలను, ఆకుకూరలను రోజువారి ఆహారంలో తింటే మన శరీరానికి అవసరమైన మినరల్స్, విటమిన్స్ ,ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి.

 ముఖ్యంగా ప్రతిరోజు విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి12 సమృద్ధిగా లభించే పాలకూరను ఆహారంగా తింటూనే వారంలో రెండు లేదా మూడుసార్లు పాలకూర జ్యూస్ ను ఉదయాన్నే సేవిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి అధికంగా పెరిగి నీరసం, అలసట, వికారం వంటి లక్షణాలను తొలగిస్తుంది.

 అలాగే విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ ఎక్కువగా లభించే పండ్ల రసాలను కూడా తీసుకోవచ్చు. మరీ ఎక్కువ చల్లగా ఉంటే న్యూమోనియా లక్షణాలు తలెత్తవచ్చు.

 సహజంగానే చలికాలంలో మన శరీరం కొంత శక్తిని కోల్పోతుంది. ఈ శక్తిని తిరిగి పొందడానికి ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును ఆహారంగా తినొచ్చు.

 ఉడికించిన గుడ్డులో అత్యధికంగా ప్రోటీన్స్, విటమిన్ ఏ, విటమిన్ ఈ,విటమిన్ డి,పొటాషియం,ఐరన్‌, జింక్‌, పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో ఉన్న ప్రోటీన్స్,విటమిన్‌ డి, అమైనో ఆమ్లాలు శరీరం కోల్పోయిన శక్తిని మరల పుంజుకునేలా చేస్తాయి.

 రోజు కొన్ని చియా గింజలను తీసుకుంటే ఇందులో లభించే కార్బోహైడ్రేట్స్, ఫైబర్ రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడంలో సహాయపడతాయి.

 తృణధాన్యాలను, డ్రై ఫ్రూట్స్, ఓట్స్ ను తప్పనిసరిగా స్నాక్స్ రూపంలో చూసుకుంటే వీటిలోని మాంసకృత్తులూ, విటమిన్స్, మినరల్స్ ఫైబర్, మెటబాలిజం రేటుని మెరుగు పరిచి శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది.