చరణ్ సినిమాకు బుచ్చిబాబు రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఉప్పెన సినిమా ద్వారా మెగా హీరో వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు దర్శకుడు బుచ్చిబాబు. 

దర్శకుడు సుకుమార్ శిష్యుడిగా ఉప్పెన సినిమా ద్వారా పరిచయమైనటువంటి ఈయన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు.

ఇలా ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బుచ్చిబాబుకు వరుస సినిమా అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.

అయితే ఇప్పటివరకు ఈయన రెండవ సినిమాను ప్రకటించకపోవడం గమనార్హం. బుచ్చిబాబు తన రెండవ సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.

ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ బుచ్చిబాబు మాత్రం తన రెండవ సినిమాని మరోసారి మెగా హీరోతో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా రాబోతుందని ప్రకటించారు.ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఎంతో ఆత్రుత కనపరుస్తున్నారు.

ఇక ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.ఇకపోతే ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు

జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం బుచ్చిబాబు రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.రెండవ సినిమాకి ఏకంగా బుచ్చిబాబు 15 కోట్లు డిమాండ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇప్పటివరకు రెండో సినిమాకి ఈ స్థాయిలో ఏ దర్శకుడు కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని సమాచారం. సుకుమార్ ఇంత డిమాండ్ చేయడంతో నిర్మాతలు కూడా ఇతనికి ఇప్పటికే అడ్వాన్స్ కూడా చెల్లించారని తెలుస్తోంది.