మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి చెడు మలినాలను బయటికి పంపడంలో కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.
కావున కిడ్నీల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు.
ప్రతిరోజు మీకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లే మీ కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీసి కిడ్నీలు ఫెయిల్యూర్ అవ్వడానికి కారణమవుతుంటారు.
ఇప్పుడు చెప్పబోయే పొరపాట్లు మీరు ప్రతిరోజు చేస్తుంటే ఇప్పటికైనా మేల్కొని తగిన జాగ్రత్తలు పాటించండి.ఈ రోజుల్లో చాలామంది అధిక పని ఒత్తిడి కారణంగా సమయానికి నీళ్లు తాగడం మర్చిపోతున్నారు.
దానికి తోడు ఏసీ గదుల్లో పనిచేస్తుండడంతో దాహం అనిపించదు. కాబట్టి నీళ్లు తాగకుండా ఉండిపోతున్నారు దీనివల్ల చెడు లవణాలు కిడ్నీలో పేరుకుపోయి భవిష్యత్తులో తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కిడ్నీల పనితీరు బాగుండాలంటే మనం ప్రతిరోజు ఐదు లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే శరీరంలోని చెడు లవణాలు సులువుగా మూత్రం ద్వారా విసర్జించబడతాయి.
మనకు దాహంగా లేకపోయినా గుర్తొచ్చినప్పుడల్లా ఒక గ్లాసుడు మంచినీళ్లను సేవిస్తే కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రోజువారి ఆహారంలో రుచి కోసం ఉప్పు, కారం , మసాలా దినుసులను ఎక్కువగా వాడుతుంటారు.
దీనివల్ల కిడ్నీ సమస్యలతో గుండెపోటు హై బీపీ సమస్య కూడా తలెత్తుతుంది. వైద్యుల సూచనల ప్రకారం రోజుకు సగటున ఒక వ్యక్తి ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడి కిడ్నీ పనితీరు దెబ్బతింటుందని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
అలాగే ఈ రోజుల్లో అధిక శ్రమ పని ఒత్తిడి కారణంగా తీవ్రమైన ఒళ్ళు నొప్పులు సమస్య ఏర్పడుతుంది ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎక్కువమంది పెయిన్ కిల్లర్స్ ను ఉపయోగిస్తారు
వీటిని అతిగా వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతిని కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందట. మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి సమస్య నుంచి బయటపడడానికి మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు బానిస అవుతుంటారు.
వీరు తక్షణమే ఈ అలవాట్లు మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన కిడ్నీ సమస్యలతో పాటు మానసిక సమస్యలు తప్పవు. మద్యం ఎక్కువగా సేవిస్తే ఇందులో ఉండే హానికర రసాయనాలు మూత్రపిండాలని, కాలేయాన్ని దెబ్బతీస్తుంది.
ఒక్కొక్కసారి కిడ్నీ మార్పిడి కూడా తప్పదు అంటున్నారు నిపుణులు. ధూమపానం ఎక్కువగా చేసే వారిలో అధిక రక్తపోటు సమస్య తలెత్తి కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది ఫలితంగా కిడ్నీ పనితీరు మందగిస్తుంది