గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిది ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే గుడ్డు తినే విషయంలో చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి.
సాధారణంగా అందరికీ వచ్చే సందేహం ఏంటంటే గుడ్డులో అత్యధిక ప్రోటీన్స్, కొవ్వు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి
వీటిని అధికంగా తింటే శరీరంలో కొవ్వు శాతం పెరిగి గుండెపోటు, రక్తపోటు సమస్యలకు దారితీస్తుందని గుడ్డు తినడం మానేస్తుంటారు.
అలా చేయడం పొరపాటు గుడ్డు సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగని రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లకు మించి ఆహారంగా తీసుకుంటే
నిజంగానే మన శరీరంలో కొవ్వు శాతం పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు.
గుడ్డు తినే విషయంలో మరికొందరు చేసే పొరపాటు ఏమిటంటే గుడ్డులోని పచ్చ సోన భాగాన్ని ఎక్కువగా తింటే శరీర బరువు పెరిగి గుండెపోటుకు కారణమవుతుందని
పచ్చసోనా భాగాన్ని పడేస్తుంటారు అలా చేయడం మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు.గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న మాట వాస్తవమే
అయినప్పటికీ దీన్ని తినడం వల్ల రక్తంలో కొవ్వు శాతం పెరగడం లేదని వైద్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు.
వైద్యుల సూచనల ప్రకారం గుడ్డు మొత్తాన్ని ఆహారంగా తీసుకుంటేనే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
ఉడకబెట్టిన గుడ్డు మొత్తం ఆహారంగా తీసుకుంటే మన నిత్య జీవక్రియలకు అవసరమైన విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి1, బీ 2, అమైనో ఆమ్లాలు,
యాంటీ ఆక్సిడెంటూ, ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఫైబర్ వంటి ఖనిజలవనాలు అధిక మొత్తంలో లభిస్తాయి.
ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు గుడ్డు పచ్చ సోనా భాగాన్ని కచ్చితంగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు
కారణం గుడ్డు పచ్చసొనలో ఉండే ఐరన్ మూలకాన్ని మన శరీరం తేలిగ్గా గ్రహించగలుగుతుంది. దాంతో రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి ప్రమాదకర రక్తహీనత సమస్యను తొలగిస్తుంది.