మనం తీసుకునే ఆహార పదార్థాలలో తగినంత కారం లేకపోతే ఆహార పదార్థాలకు ఏమాత్రం రుచి ఉండదు.
అందుకే మనం తయారు చేసుకునే ఆహార పదార్థాలకు సరిపడా ఉప్పు కారం వేసుకుంటేనే ఆహారం రుచిగా ఉంటుంది.
అయితే చాలామంది తక్కువగా కారం తినడానికి ఇష్టపడతారు కానీ ఆహారంలో కారం ఎక్కువగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని
వైద్యులు తరచూ చెప్పడం వినే ఉంటాం. అయితే ఇటీవల కొన్ని పరిశోధన ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ప్రతిరోజు ఆహారంలో కారం ఎక్కువగా తినే వారు ఎక్కువ రోజులు జీవిస్తున్నారట.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే అంటున్నారు పరిశోధన నిర్వహించిన వైద్యులు.
ఇటీవలే చైనాలోని కొన్ని ప్రాంతాల ప్రజల పైన నిర్వహించిన సర్వేల్లో ఈ ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వారానికి రెండుసార్లు మాత్రమే కారం తినే వారితో పోలిస్తే
ప్రతిరోజు కారం తినేవారికి ఆయుష్ ఎక్కువగా ఉంటుందని, కారం ఎక్కువగా తినేవారిలో 10% మరణాల రేటు తక్కువగా ఉందని సర్వే వెల్లడిస్తోంది.
ప్రతిరోజు పచ్చిమిర్చి, మిరియాలు రోజువారి ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ప్రపంచ శాస్త్రవేత్తలు మాత్రం చైనా ప్రజల జీవన విధానం అక్కడి సాంప్రదాయ వంటల వల్ల అలా జరిగి ఉండవచ్చు అన్ని చోట్ల దాని ఫలితాలు ఒకేలా ఉంటాయి
అనుకోవడం మంచిది కాదు. అక్కడి ప్రజలకు ఈ సర్వే మంచి చేయొచ్చు ఇతర దేశాల ప్రజలకు ఈ సర్వేని అన్వయించుకోవడం
మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆరోగ్యానికి మంచిది కదా అని అధికంగా తినడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.