ఈ ఆకుల కషాయాన్ని సేవిస్తే..! డయాబెటిస్, కిడ్నీ ఇన్ఫెక్షన్, డిప్రెషన్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి..

 తీగ జాతి కాయగూరల్లో దొండకాయ కు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా దొండ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు

 తీవ్రమైన వ్యాధి కారకాలను నియంత్రించడంలో సహాయపడతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

 దొండ కషాయంలో యాంటీ ఆక్సిడెంట్సు, యాంటీబయోటిన్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నందున ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.

  అలాగే దొండకాయల్లో సమృద్ధిగా విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 12, ఫైబర్ పొటాషియం, మెగ్నీషియం,

 వంటి ఖనిజ లవణాలతో పాటు మనలో వ్యాధి కారకాలను నశింపజేసే ఔషధ గుణాలు మెండుగా లభ్యమవుతున్నాయి.

 దొండకాయను రోజువారి ఆహారంలో తీసుకున్నట్లయితే ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్ బి6,బీ 12, యాంటీ ఆక్సిడెంట్, జింక్ , మెగ్నీషియం

 అలాగే మెదడు కండరాలను,న్యూరాన్స్ నీ శాంత పరిచి మెదడు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది.

 దొండకాయ లోని ఔషధ గుణాలు కాలేయంలోని మలినాలను తొలగిస్తుంది ఫలితంగా ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.

 చక్కెర వ్యాధితో బాధపడేవారు దొండ ఆకు కషాయాన్ని 30 గ్రాముల మోతాదులో ప్రతిరోజూ తీసుకుంటే చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది.

 దొండ కాయ పిత్త వ్యాధులను, రక్తపోటును, వాత వ్యాధులను నియంత్రిస్తుందని ఆయుర్వేదం చెపుతోంది. ఇందుకు కారణం దొండకాయలో పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉండడమే.

 చర్మ సమస్యలతో బాధపడేవారు దొండ ఆకులను మెత్తని చూర్ణంగా చేసుకొని చర్మ సమస్యలు ఉన్నచోట మర్దన చేసుకుంటే బ్యాక్టీరియా, వైరల్ ,ఫంగల్ ఇన్ఫెక్షన్లన్నీ తొలగిపోతాయి.

 కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు మరియు మూత్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మంట సమస్యతో బాధపడేవారు తరచూ దొండ ఆకుల కషాయాన్ని సేవిస్తూ తక్షణ ఫలితం లభిస్తుంది.