మహాశివరాత్రి రోజు ఈ వస్తువులను దానం చేస్తే చాలు మీ ఇంట కనక వర్షమే!

 మరి కొద్ది రోజులలో మహాశివరాత్రి పండుగ రానున్న నేపథ్యంలో ఇప్పటికే శివరాత్రి పండుగ సందర్భంగా శివాలయాలని ముస్తాబవుతున్నాయి.

 మాఘమాసం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన మాసం. దీంతో ఎంతోమంది బాగా స్నానాలు చేస్తూ పరమేశ్వరుడిని ఆరాధిస్తూ ఉంటారు.

 ఇక ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శివరాత్రి పండుగ రోజు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శుభం కలుగుతుందని భావిస్తారు

  మరి శివరాత్రి పండుగ రోజు ఎలాంటి వస్తువులను దానం చేయాలి అనే విషయానికి వస్తే…

 హిందూమతంలో ఆవును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు అందుకే శివరాత్రి పండుగ రోజు గోమాతకు రొట్టెలను ఆహారంగా తినిపించడం వల్ల

 మనం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అలాగే మన జీవితంలో కూడా ఎంతో పురోగతి ఉంటుంది.

 ఇక శివుడికి ఎంతో ప్రీతికరమైన పాలు లేదా పాలతో తయారు చేసిన పదార్థాలను దానం చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.

 పండుగ రోజున పేదవారికి బియ్యం, పంచదార, పాలు లేదా ఖీర్ దానం చేయడం వల్ల మీ కెరీర్ దూసుకుపోతుంది. ఈ రోజు పేదలకు బట్టలు పంపిణీ చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది.

 అంతేకాకుండా మీ దోషాలన్నీ తొలగిపోతాయి. మహాశివరాత్రి రోజున వస్త్రదానం చేయడం కూడా ఎంతో మంచిది శివరాత్రి రోజు

 నల్లటి నువ్వులను దానం చేయటం వల్ల శని దేవుడి అనుగ్రహం మనపై ఉండి శని బాధలు కూడా తొలగిపోతాయి.