ప్రతి రోజు వారి కార్యక్రమాలలో భాగంగా మనం నిత్యం ఎన్నో పనులను చేస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే కొన్నిసార్లు తెలిసి తెలియక మనం చేసే పనులలో పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి
ఈ విధంగా జరిగే పొరపాట్ల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతుంటాయి.
ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు కొన్ని పనులను చక్కగా సరైన సమయానికి నిర్వహించడం ఎంతో మంచిదని పండితులు చెబుతుంటారు.
అయితే ఈ విషయాలను పాటించాలా వద్దా అనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం.ఈ క్రమంలోనే పెద్దలు ప్రతిరోజూ కొన్ని రకాల పనులను చేయకూడదని చెబుతుంటారు మరి ఆ పనులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….
చాలామంది పొద్దు పొడిచిన తర్వాత నిద్ర లేచి పాచి శుభ్రం చేసి నీళ్లు చల్లుతారు. ఇలా చేయడం మంచిది కాదు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి ముందు చెత్త శుభ్రం చేసి నీళ్లు చల్లాలి.
అదేవిధంగా చాలామందికి నిద్ర లేవగానే దుప్పటి అలాగే వదిలి వెళ్లడం అలవాటుగా ఉంటుంది . ఇలా పొరపాటున కూడా చేయకూడదు.
ఇక చాలామంది భోజనం చేసిన చోట ఎంగిలి కంచం ముందు అలాగే కూర్చుంటారు. ఇలా కూర్చోవడం పరమ దరిద్రం.
ఇక చాలామంది పూజ చేసే సమయంలో దేవుడి గదిలో ఒకే దేవుడికి సంబంధించి రెండు ఫోటోలను పెడతారు. ఇలా రెండు ఫోటోలు ఉండకూడదు.
అలాగే సాయంత్రం ఆరు గంటల తర్వాత సూది, నూనె, ఉప్పు కోడిగుడ్లు వంటి వస్తువులను కొనుగోలు చేయకూడదు.
ఈ వస్తువు కనుక కొనుగోలు చేస్తే వీటితో పాటు శని కూడా మన వెంటే వస్తుంది. అందుకే సాయంత్రం 6 దాటితే ఈ వస్తువులను కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.