అందమైన మెరిసే దంతాల కోసం మీరు ప్రయత్నిస్తుంటే.. ఈ ఆహార నియమాలు పాటించి చూడండి!

 అందమైన మెరిసే ముత్యాల్లాంటి దంతాలు మీలో ఉంటే ఆత్మవిశ్వాసం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 కారణం దంతాలు పచ్చగా గార పట్టినట్లు ఉంటే నలుగురిలో స్వేచ్ఛగా నవ్వటానికి, మాట్లాడడానికి కూడా ఇష్టపడక మీలో ఉన్న భావాలను వ్యక్తపరచడానికి సంకోచిస్తుంటారు ఫలితంగా మీలో ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది.

 మీరు ఇలాంటి సమస్య నుంచి బయట పడాలంటే ప్రతి రోజు కొన్ని రకాల తాజా పండ్లను ఆహారంగా తీసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

 మనలో సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతిరోజు ఒక ఆపిల్ పండు తినాలని చెబుతుంటారు కదా. అలాగే మన దంతాల దృఢత్వానికి చిగుళ్ల ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఆపిల్ పండ్లలో సమృద్ధిగా లభిస్తాయి.

 అలాగే పైనాపిల్ పండులు సమృద్ధిగా కాల్షియం, విటమిన్ సి ఉండి దంతాల చిగుళ్ల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ముఖ్యంగా పైనాపిల్ పండులో ఉండే బ్రోమోలైన్ దంతాలపై పట్టే గారను తొలగించి దంతాలను తెల్లగా మారుస్తుంది.

 దంతాలు ఎముకలు దృఢంగా ఉండాలంటే విటమిన్ డి, కాల్షియం సమృద్ధిగా కలిగిన చీజ్ తగిన పరమాణంలో తీసుకోవడం మంచిది.

 రోజు పచ్చి క్యారట్లను తినేవారిలో దంత క్షయ సమస్య తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 కారణం క్యారెట్ లో యాంటీ మైక్రోబియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి సమృద్ధిగా లభించి నోటిలో ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ ను నశింప చేస్తాయి.

 బెర్రీస్ , కివి ఫ్రూట్స్ ఎక్కువగా తింటే చిగుళ్ల ఇన్ఫెక్షన్ తగ్గించే గుణాలు మెండుగా ఉండి దంతాల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం అరటి తొక్కతో పళ్ళు తోముకుంటే పంటి సహజ అందాన్ని కోల్పోకుండా ఉంచుతుంది.

 తరచూ బ్రోకలీ నీ ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే ఔషధ గుణాలు పంటిపై ఉండే ఎనామిల్ పొరను రక్షించి దంతాల సహజ కాంతిని దృఢత్వాన్ని కాపాడుతుంది.