మనం చేసే పనిలో సక్సెస్ కావాలంటే ఈ పనులు తప్పనిసరిగా చేయాల్సిందే!

సాధారణంగా మనం ఏ పని చేసిన కొన్ని కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి

ఈ క్రమంలోనే మనం చేసే పనులు విజయవంతంగా పూర్తి కావాలి అంటే ఆంజనేయస్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు.

ఇలా ఆంజనేయ స్వామిని పూజించే విధానంలో కూడా కొన్ని నియమ నిబంధనలను పాటించడం వల్ల మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఎంతో విజయవంతంగా పూర్తి అవుతాయి

మరి ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి అనే విషయానికి వస్తే… ప్రతిరోజు ఆంజనేయస్వామి చాలీసాను 11 సార్లు చదవాలి.

అయితే హనుమాన్ చాలీసా చదివేటప్పుడు ఒకే ఆసనం పై కూర్చుని చదవాలి ఈ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడం పూర్తి అయ్యేవరకు పక్కన కు లేయకూడదు.

ఇలా 11 సార్లు హనుమాన్ చాలీసా చదవడం పూర్తి అయిన తర్వాత చివరిలో శ్రీరామరక్ష స్తోత్రం చదవాలి.

ఇలా మంగళవారం ఒక పూట ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా చదవడం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.

ఇక మంగళవారం స్వామివారికి పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను సమర్పించడం ఎంతో ముఖ్యం

అయితే చాలామంది ఇంట్లో కన్నా ఇలా హనుమాన్ చాలీసాను స్వామి వారి ఆలయంలోకి వెళ్లి చదువుతూ ఉంటారు అక్కడైతే ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడమని భావిస్తుంటారు.

ఇలా వారంలో మంగళవారం ఇలా హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనం అనుకున్న పనులు నెరవేరుతాయి

ఇక వీలైతే మన ఆర్థిక స్తోమతను బట్టి నెలకు ఒకసారి అయినా స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం ఎంతో మంచిది.