“వీరసింహా రెడ్డి” ఫస్ట్ డే అంత వసూలు చేస్తే.?

 టాలీవుడ్ సీనియర్ స్టార్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “వీరసింహా రెడ్డి”.

 దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యి అందరి అంచనాలు అయితే అందుకుంది చెప్పాలి.

 మొదట బాలయ్య అభిమానులకే నచ్చేలా ఉన్నప్పటకీ రెండో రోజు కూడా ఈ చిత్రం వరల్డ్ వైడ్ క్రేజీ హోల్డ్ కనబరచడం విశేషంగా మారింది.

 మరి ఈ చిత్రం అయితే కనీ వినీ ఎరుగని రేంజ్ వసూళ్లు నమోదు చేస్తుందని ఆల్రెడీ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

 మరి వారు చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా మొదటి రోజు షాకింగ్ మొత్తంలో 50 కోట్ల మేర గ్రాస్ ని చేస్తుందని చెప్పడం విశేషం.

 కాగా సినిమాకి కనిపించిన ఊపు ఆల్రెడీ వస్తున్న లెక్కలు చూస్తుంటే ఇది సాధ్యమే అన్నట్టుగా తెలుస్తుంది.

 యూఎస్ మార్కెట్ లో కేవలం ప్రీమియర్స్ తోనే 7 లక్షల డాలర్స్ అందుకున్న ఈ చిత్రం మొదటి రోజుతో ఎలా 1 లేదన్నా మిలియన్ డాలర్స్ కొట్టేసింది.

 దీనితో మొదటి రోజుకే అక్కడ నుంచే సుమారు 15 నుంచి 18 కోట్ల మధ్యలో గ్రాస్ కొట్టేసింది.

 ఇక తెలుగులో చూస్తే ఈజీగా 30 కోట్ల గ్రాస్ ఉంటుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

 దీనితో బాలయ్య కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ ఈ సినిమాతో వస్తున్నట్టుగా చెప్పొచ్చు. దీనితో వీరసింహా రెడ్డి వసూళ్లు మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.