రవితేజ గురించి ఎవరైనా అలా చెబితే నా పేరు మార్చుకుంటా… శ్రీ లీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?

 అదృష్టం ఉంటే సినిమా ఇండస్ట్రీలో రాత్రికి రాత్రి స్టార్లుగా మారిపోతారు.

 ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి కేవలం ఒకే ఒక సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు.

 రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు హీరోగా తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

 ఈ సినిమాలో శ్రీ లీల అందానికి ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా చెప్పుకోదగ్గ హిట్ కాలేకపోయినా కూడా స్త్రీ లీలా మాత్రం హీరోయిన్ గా హిట్ అయ్యింది.

 దీంతో ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో బడా హీరోల సరసన నటించే అవకాశాలు అందిపుచ్చుకుంది.ప్రస్తుతం శ్రీ లీల చేతిలో దాదాపు ఆరు సినిమాలు ఉన్నాయి.

 ఇదిలా ఉండగా ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ధమాకా సినిమాలో శ్రీ లీల నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకి రానుంది.

  ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ, శ్రీ లీల పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

 అంతేకాకుండా ఇటీవల జరిగిన బిగ్ బాస్ ఫైనల్స్ లో కూడా సందడి చేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న శ్రీ లీల సినిమా విశేషాలతో పాటు రవితేజ గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

 రవితేజ గురించి శ్రీ లీల చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో శ్రీ లీల మాట్లాడుతూ…’ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలని చూశాను.

 అందరూ ఇష్టమే.. కానీ రవితేజ గారి లాంటి హీరోని నేను ఇప్పటివరకు చూడలేదు . ఎందుకంటే రవితేజ గారు సినిమా పట్ల ఎంత డెడికేషన్ చూపిస్తారో నాకు ఈ సినిమా షూటింగ్ సమయంలో తెలిసింది.

  ఈ సినిమాలో దండకడియల్ సాంగ్ చేస్తున్నప్పుడు రవితేజ కాళ్లకి గాయమై 12 కుట్లు పడ్డాయి. అయితే తన వల్ల షూటింగ్ బ్రేక్ పడకూడదు అని ఆ పాట కోసం ఆ నొప్పి భరిస్తూ డాన్స్ చేశారు.

 అయితే ఎవరైనా సరే ఆ పాట చూసి రవితేజ కాళ్ళకి గాయమైన మాటను చెప్తే మాత్రం నేను నా పేరు మార్చుకుంటా..

 అంతలా ఆయన నొప్పి కనిపించకుండా నవ్వుతూ డ్యాన్స్ చేశారు” అంటూ చెప్పుకొచ్చింది . ప్రస్తుతం శ్రీలీల మాట్లాడిన ఈ మాటలు వైరల్ గా మారాయి.