ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధారణంగా సినిమా హీరోలను టార్గెట్ చేయడానికి ఇష్టపడరు. అయితే జగన్ టార్గెట్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.
పవన్ కళ్యాణ్ సినిమాలకు జగన్ ఏ స్థాయిలో ఇబ్బందులను సృష్టించారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే బాలయ్య మాత్రం జగన్ ను పదేపదే టార్గెట్ చేస్తున్నారు. తన సినిమాల్లో జగన్ కు వ్యతిరేకంగా డైలాగ్స్ ఉండేలా బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే జగన్ బాలయ్య వీరాభిమాని కావడంతో బాలయ్యకు వ్యతిరేకంగా ఎప్పుడూ అడుగులేయలేదు.
ఒకవేళ జగన్ బాలయ్యపై దృష్టి పెడితే మాత్రం ఏపీలో టికెట్ రేట్లు మళ్లీ తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఉండదని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జాగ్రత్తగా ఉండకపోతే జగన్ వల్ల బాలయ్య సినిమాకు ఇబ్బందులు తప్పవని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమాకు కూడా జగన్ సర్కార్ ఇబ్బందులకు గురి చేసింది.
నాని చేసిన కామెంట్లు ఏపీ పరువుకు భంగం కలిగించే విధంగా ఉండటంతో జగన్ సర్కార్ ఈ దిశగా అడుగులు వేసింది.
రాబోయే రోజుల్లో జగన్ సర్కార్ సినీ సెలబ్రిటీలకు షాకిచ్చే దిశగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
జగన్ ను టార్గెట్ చేసేలా సినిమాలలో డైలాగ్స్ పెట్టడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా కామెంట్ చేయాలే తప్ప ఇష్టానుసారం కామెంట్లు చేయడం మాత్రం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తుండగా ఈ కామెంట్లు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి.