బాబు ఇలా చేస్తే… జగన్ కు పుట్టగతులుండవంట!

 ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తాదని.. పోటీచేసిన 175 స్థానాల్లోనూ గెలిచి తీరుతుందని చెబుతున్నారు వైకాపా అధినేత జగన్.

 గెలిచే స్థానాల సంగతి కాసేపు పక్కన పెడితే… ఒంటరిగానే పోటీ చేస్తామని కరాకండీగా చెబుతున్నారు. అయితే జగన్ కు చెక్ పెట్టాలంటే…

 జనసేన – టీడీపీ లు పొత్తులో ఉంటే మంచిదే కానీ… అంటూ ఒక సర్వే విషయాలు ఆన్ లైన్ లో వైరల్ చేస్తున్నారు జనసైనికులు!

 టీడీపీ.. జనసేన తో పొత్తుపెట్టుకున్నా… జనసేన.. టీడీపీతో మైత్రి కుదుర్చుకున్నా… “వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు” అని గతంలో జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలకు

 న్యాయం జరిగినట్లే కదా అనుకుంటే పొరపాటే అంటున్నారు ఆ సర్వే వివరాలు చెబుతున్నా జనాలు! అవును.. టీడీపీతో జనసేన కలవడం వల్ల ప్రత్యేకంగా ప్రయోజనం ఏమీ ఉండదని అంటున్నాయి సర్వే వివరాలు.

 ఇప్పటికే టీడీపీ గురించి – బాబు పాలన గురించి ఏపీ జనాలు ఫుల్ క్లారిటీ ఉందని, కాబట్టి.. కొత్తగా జనాలు ఆలోచించి ఓటు వేయడానికి ఏమీ లేదని…

 జగన్ సర్కార్ తో మరీ విసిగిపోయిన అతికొద్ది శాతం ప్రజల ఓట్లు మాత్రమే వస్తాయని చెబుతుందట ఆ సర్వే! కానీ.. జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందంట!

 ఈ లాజిక్కేమిటబ్బా అంటే… జనసేన ఒంటరిగా 175 నియోజకవర్గాల్లోనూ పోటీచేసే పరిస్థితి కాస్త కష్టం కాబట్టి.. మెజారిటీ సీట్లు జనసేనకు ఇచ్చి – అంతకంటే తక్కువ సీట్లలో టీడీపీ పోటీచేయాలంట.

 అనంతరం.. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలంట. ఫలితంగా… ఇప్పటివరకూ పవన్ పాలనను ఏపీ వాసులు చూడలేదు కాబట్టి.. ఒకసారి చూద్దాం అనే ఉద్దేశ్యంతో అవకాశం లభిస్తుందట!

 ఇలా టీడీపీతో జనసేన కలవడం కంటే… జనసేనతో టీడీపీ కలిస్తే జగన్ కు పుట్టగతులుండవని… 2019 లో వచ్చిన ఫలితాలు తారుమారు అవుతాయని ఆ సర్వే సారాంశం అంట!

 మరి ఈ కొత్త లాజిక్ కి బాబు ఒప్పుకుంటారా? అసలు పవన్.. చంద్రబాబు ని ఈ దిశగా అడిగే ధైర్యం చేయగలరా? ఇవన్నీ ఏపీ జనాలకు సమాధానం తెలిసిన ప్రశ్నలే కదా!!